breaking news
production restarted
-
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
500 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం
గణపురం: వరంగల్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ఆదివారం పునఃప్రారంభించారు. గణపురం మండలం చెల్పూరు ప్లాంట్‌లో 25 రోజులుగా జరిగిన వార్షిక మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం సింక్రనైజేషన్ చేశారు. మరమ్మతు పనులు సంక్రాంతి సెలవుల కారణంగా కొంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. వివిధ ప్లాంట్లకు చెందిన 400 మంది అనుభవజ్ఞులైన మెకానిక్‌లు మరమ్మత్తు పనులు నిర్వహించారు.