breaking news
presidential candidate selection
-
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్ ప్రైమ్‌టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
మిత్రపక్షాలతో చర్చించాకే..
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అమిత్ షా ముంబై: అన్ని మిత్రపక్షాలతో చర్చించాకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ పేరును రాష్ట్రపతి ఎన్నిక కోసం శివసేన చేసిన సూచనపై ఆయన స్పందించారు. బీజేపీ బలోపేతం కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న షా శనివారం మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య త్వరలో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పునఃప్రారంభం అవుతాయన్న వార్తల్ని తోసిపుచ్చారు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్తాన్‌లు కలిసి ఆడడం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్లో భారత్ గానీ, భారత్‌లో పాకిస్తాన్ గానీ ఆడవ’ని సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఒకవేళ మధ్యంతర ఎన్నికలుS తప్పనిసరైతే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమనేదే ఫడ్నవిస్ అభిప్రాయమని వివరణిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేసులో ఉన్నానంటూ వస్తోన్న వార్తల్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తోసిపుచ్చారు. శనివారం విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ..‘అవన్నీ పుకార్లు.. నేను విదేశాంగ శాఖ మంత్రిని.. అయితే మీరు పార్టీ అంతర్గత విషయంపై ప్రశ్నిస్తున్నార’ని చెప్పారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల కోసం శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.