breaking news
nobel in literature
-
Nobel Prize 2025: నామినేటెడ్ పేర్లు .. 50 ఏళ్లగా ఎందుకంత సీక్రెట్?
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించే వారం దగ్గరపడింది. ఈ సోమవారం అంటే అక్టోబరు 6 నుంచి అక్టోబరు 13 వరకు విజేతల ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించేవారిని నోబెల్ బహుమతులతో సత్కరించనున్నారు.జ్యూరీ అనుసరించే విధానంనోబెల్ బహుమతుల ఎంపిక ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అవార్డుల విజేతలను జ్యూరీ అత్యంత రహస్యంగా ఎంపిక చేస్తుంది. గోప్యత అనేది విజేతల ఎంపికలో తప్పనిసరి విధానం. ఇది నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. నామినీలు, నామినేటర్ల గుర్తింపులను గత 50 ఏళ్లగా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి విధానం బాహ్య ఒత్తిళ్లు, ఊహాగానాలను నివారిస్తుంది. అవార్డుల గొప్పతనాన్ని కాపాడుతూ, విజేతలు ఎవరనే ఉత్కంఠను కొనసాగిస్తుంది. ప్రముఖ ప్రొఫెసర్లు, మునుపటి అవార్డు గ్రహీతలు, ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, శాంతి పరిశోధన సంస్థల డైరెక్టర్లు.. నోబెల్ బహుమతులకు అర్హులైవారిని నామినేట్ చేస్తారు. స్వీయ నామినేషన్లకు అవకాశం ఉండదు.శాంతి బహుమతి విభాగంలో..నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి వర్గానికి లేదా విభాగానికి చెందిన నిపుణుల కమిటీలు నామినేషన్లను సమీక్షిస్తాయి. ఈ కమిటీలు నివేదికలను సిద్ధం చేస్తాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న బహుమతి ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉన్నారా? లేదా అనే దానిపై చర్చలు జరుగుతాయి. నోబెల్ శాంతి బహుమతి విభాగంలో నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’ ఎంపికకు సారధ్యం వహిస్తుంది. వారు తమకు అందిన నామినీల నుండి ఒక షార్ట్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటారు. తుది నిర్ణయాన్ని సాధారణంగా ఏకాభిప్రాయం మేరకు తీసుకుంటారు. అక్టోబర్‌లో అధికారిక ప్రకటనకు ముందు ఈ తతంగమంతా జరుగుతుంది.ఎంపిక ప్రక్రియలో వీటికి తావుండదుసాహిత్యంలో నోబెల్ బహుమతి విషయానికొస్తే స్వీడిష్ అకాడమీ సభ్యులు నామినేటెడ్ అభ్యర్థులను రచనలను రహస్యంగా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యుల మెజారిటీ మద్దతును అందుకున్నవారే తుది అర్హత సాధిస్తారు. గోప్యతా నియమం అన్ని బహుమతి విభాగాలకు వర్తిస్తుంది. లాబీయింగ్, మీడియా హైప్, రాజకీయ జోక్యం మొదలైనవాటికి ఎంపిక ప్రక్రియలో తావుండదు. కఠినమైన గోప్యత, నిపుణుల నిర్ణయం, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే నోబెల్ బహుమతులకు అత్యంత అర్హులైనవారిని ఎంపిక చేస్తారు. -
జర్నలిస్టుకు తొలిసారి నోబెల్ బహుమతి
రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ విరజిమ్మిన పాషాణానికి బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపిస్తాయి. వాటిని యథాతథంగా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడమే ఆమె రచనల ముఖ్య ఉద్దేశం. రచనా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. జీవన గమనంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వారి మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి. అందుకు కారణం.. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్టు అవడమే. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు ఆమే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ వారు. ఆమె ఉక్రెయిన్‌లోని స్టానిష్లే నగరంలో 1948, మే 31వ తేదీన జన్మించారు. తండ్రి బెలారస్‌కు చెందినవారు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. పాఠశాల చదువు పూర్తి కాగానే పలు స్థానిక పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. మిన్స్క్ నగరంలో 'నేమన్' అనే సాహిత్య పత్రికలో పనిచేశారు. చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ సాహిత్య అవార్డు లభించింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ యుద్ధం, సోవియెట్ పతనంపై ఆమె పలు పుస్తకాలు రాశారు, పలు అవార్డులు అందుకున్నారు. అదే సమయంలో జీవతంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అందుకనే 2000 సంవత్సరంలో బెలారస్‌ను వీడాల్సి వచ్చింది. పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆమె 2011లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. 'వాట్ ఈజ్ టు బి డన్, హూ ఈజ్ టు బి బ్లేమ్డ్' అన్న నినాదమే ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. -
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
రష్యన్ పాలనపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం కన్నీటి చుక్కలు కార్చి.. వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాసిన ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్ను ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, రాయడంలో అపార ధైర్య సాహసాలు కనబరిచే స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్వెత్లానా పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఓ పాత్రికేయుడు.. రెండు గంటల ముందే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఆ పేరుమీదే ట్వీట్ చేశారు. అంటే బహుమతి ప్రకటనకు ముందే అతడికి ఈ విషయం తెలిసిపోయిందన్న మాట!


