breaking news
Nava Bharat Ventures
-
నవభారత్ వెంచర్స్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల ఊతంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ నికర లాభం రెట్టింపై రూ. 24 కోట్ల నుంచి రూ. 58 కోట్లకు (స్టాండెలోన్) ఎగిసింది. ఆదాయం రూ. 280 కోట్ల నుంచి రూ. 302 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 3 డివిడెండు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లైకోస్: పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 2,255 కోట్ల కన్సాలిడేట్ ఆదాయంపై రూ. 405 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,957 కోట్లు కాగా లాభం రూ.342కోట్లు. -
నవభారత్ వెంచర్స్ లాభం రూ. 24 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నవభారత్ వెంచర్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 279 కోట్ల ఆదాయంపై రూ. 24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 314 కోట్ల ఆదాయంపై రూ. 46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది మొత్తం మీద చూస్తే రూ. 1,153 కోట్ల ఆదాయంపై రూ. 142 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వాటాదారులకు ప్రతీ షేరుకు రూ. 5 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.