breaking news
labour officer
-
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కిడ్నాప్,హత్య
-
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కిడ్నాప్, హత్య
కాజీపేట అర్బన్ /భూపాలపల్లి /జనగామ అర్బన్: రియల్ మాఫియా ఉచ్చులో పడిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి (45) హత్యకు గురయ్యారు. వ్యాపార లావాదేవీల కారణంగా హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. హత్యా ప్రదేశాన్ని నిందితుల్లో ఒకరు చూపించగా.. మృతదేహాన్ని మంగళవారం రాత్రి పొద్దుపోయాక గుర్తించారు. జనగామ నుంచి ఖమ్మం జనగామ జిల్లా ఓబుల్‌కేశపూర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు ఆనంద్‌రెడ్డి తొలుత జనగామ, వరంగల్‌లలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఇన్చార్జి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వచ్చే ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన హన్మకొండలోని ఓ హోటల్‌కు ప్రదీప్‌రెడ్డి వచ్చాడని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ హోటల్‌కు వెళ్లాక ఏం చర్చించుకున్నారో ఏమో కానీ.. బయటకు వెళ్లే సమయంలో ఆనంద్‌రెడ్డి తన సోదరుడు శివకుమార్‌రెడ్డికి ఫోన్ చేశారు. ‘ప్రదీప్‌రెడ్డి భూపాలపల్లి రామారంలో స్థలం చూపిస్తానని చెబుతున్నాడు.. నువ్వు కూడా రా’అంటూ శివకుమార్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. దీంతో ఆయన నేరుగా భూపాలపల్లికి వెళ్లి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో హన్మకొండలో తమ బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. 8న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. తమకు ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని ఆనంద్ సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, హన్మకొండ హోటల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ప్రదీప్‌రెడ్డి కారులో ఆనందర్ రెడ్డి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇసుక వ్యాపారం కోసం రూ.80 లక్షల అప్పు ప్రదీప్‌రెడ్డి చేసే ఇసుక వ్యాపారం నిమిత్తం ఆనంద్‌రెడ్డి రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. కాగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, అందుకు తగ్గట్లు స్థలాన్ని ఇస్తానని బదులిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో భూపాలపల్లి రాంపూర్‌లో స్థలం చూపిస్తామని నమ్మించి తన స్నేహితుడు, డ్రైవర్‌తో కలసి వాహనంలో ఆనంద్‌ను తీసుకెళ్లి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, వేరే చోట హత్య చేసి రాంపూర్ వద్ద మృతదేహాన్ని వేశారా, లేక అక్కడే హత్య చేశారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మృతదేహాన్ని చూపించిన నిందితుల్లో ఒకరు? ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించినట్లు సమాచారం. అనుమానితులైన ప్రదీప్‌రెడ్డి, ఆయన సోదరుడు, డ్రైవర్ ఫోన్లు స్విచ్చాఫ్ వచ్చినట్లు సమాచారం. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురిలో ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్– రాంపూర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని గట్టమ్మ దేవాలయం సమీపంలో ఆనంద్‌రెడ్డి మృతదేహం ఉందని నిందితుడు చెప్పగా.. లైట్ల సాయంతో గంటపాటు వెతికారు. దుర్వాసన ఆధారంగా గట్టమ్మ గుడి నుంచి కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. చేతులు కట్టేసి హత్య ఆనంద్‌రెడ్డిని ముగ్గురు వ్యక్తులు కలసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒక టెంటు కింద కూర్చొని మద్యం సేవించాక.. అతడి చేతులు వెనుకకు కట్టేసి చంపినట్లు చెబుతున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఎక్కడెక్కడ కత్తిపోట్లు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. ప్రదీప్‌రెడ్డిని గత ఏడాదే బహిష్కరించాం: టీఆర్ఎస్ కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదని.. ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పలు పార్టీలు మారిన ప్రదీప్‌రెడ్డి.. టీఆర్ఎస్లో చేరినా కొద్దికాలమే కొనసాగారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు గతేడాది మే 6న పార్టీ నుంచి ప్రదీప్‌రెడ్డిని సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. -
లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య
-
లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, వరంగల్ : ఖమ్మం లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు. ఆనంద్‌రెడ్డిని సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి హత్యచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌రెడ్డి మూడు రోజుల కిందట హన్మకొండలో కిడ్నాప్ అయ్యారు. నగరంలోని ఒక హోటల్ నుంచి బయటకు వెళ్లిన ఆనంద్‌రెడ్డి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆనంద్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు భూపాలపల్లి అడవుల్లో ఆనందర్‌రెడ్డి ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ దిశలో విచారణ చేపట్టారు. మరోవైపు ఆనంద్‌ను ప్రదీప్ తీసుకెళ్లిన కారును పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించారు. కారును వాష్ చేసి అల్వాల్‌లోని స్నేహితుడి ఇంటివద్ద వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లేబర్ ఆఫీసర్
కరీంనగర్ : హమాలీ కార్మికుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ లేబర్ ఆఫీసర్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన అనిల్ అనే హమాలీ కార్మికుడు కూలీ ధ్రువీకరణ పత్రం కోసం లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును ఆశ్రయించాడు. సర్టిఫికేట్ మంజూరు చేయాలంటే రూ.4 వేలు లంచం కావాలని ఆ ఆఫీసర్ డిమాండ్ చేయడంతో అనిల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా స్కెచ్ గీసిన ఏసీబీ అధికారులు బుధవారం అనిల్ నుంచి లంచం తీసుకుంటుండగా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టుచేశారు. -
'రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు'
హైదరాబాద్: లేబర్ కమిషనర్ కార్యాలయంలో రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు అందిందని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే విభజన చట్టం ప్రకారమే నిధులు బదిలీ చేశామని ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ మురళీసాగర్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. సంక్షేమ బోర్డు నిధులపై కస్టోడియన్ అధికారం తమకుందని వెల్లడించారు.