breaking news
Kushendar Ramesh Reddy
-
క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు – సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి
‘‘తెలుగులోనూ కంటెంట్ బేస్డ్ సినిమాలొస్తాయని ‘త్రిబాణధారి బార్బరిక్’ నిరూపిస్తుందన్న నమ్మకం మాకు ఉంది. ఈ తరహా చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు. అద్భుతమైన క్లైమాక్స్ కుదిరింది’’ అని సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి అన్నారు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా, సత్యం రాజేశ్ క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమాకు ‘పొలిమేర, రజాకార్’ చిత్రాల ఫేమ్ కుశేందర్ రమేశ్ రెడ్డి కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం కథ. ‘పొలిమేర, రజాకార్’ సినిమాల కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ చిత్రకథ విన్నప్పుడూ అలాంటి ఫీలింగే కలిగింది. ఈ సినిమాను ఎక్కువగా రాత్రి పూట, రెయిన్ ఎఫెక్ట్స్‌లోనే షూటింగ్ చేశాం. అయితే వేసవి కాలంలో రెయిన్ సీజన్ ఎఫెక్ట్‌ని చూపించడం అంత సులభం కాదు. ఇదే మాకు పెద్ద సవాల్‌గా అనిపించింది. ఎండాకాలంలో వానా కాలాన్ని సృష్టించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి సత్యరాజ్‌గారితో పరిచయం ఉంది. నైట్ షూట్స్, రెయిన్ ఎఫెక్ట్ సీన్లంటూ మేం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాం (నవ్వుతూ). ఇక అల్లరి నరేశ్‌గారి ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా చేశాను. ఇటీవలే ‘కామాఖ్య’ చిత్రీకరణ ప్రారంభమైంది. ‘పొలిమేర 3’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. దర్శకుడు అనిల్‌గారితో వరుస సినిమాలు ఉంటాయి’’ అని తెలిపారు. -
దర్శకుడి ఆలోచనని దృశ్యరూపం అందించడమే లక్ష్యం
ఒక మనిషి ఆలోచనతో మొదలై ఎన్నో అద్భుతాలును సృష్టించేదే సినిమా. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో వైవిధ్యమయిన కథ కథనాలతో ప్రేక్షకుల మనసును మెప్పించడానికి దర్శకుల ప్రతిభతో పాటు ప్రతి సన్నివేషాన్ని కథకు అనుగుణంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా చిత్రీకరించటంలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాల ప్రధానమైనది. ప్రతి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తనకంటూ వున్న శైలితో నవతరాన్ని ఆకట్టుకుంటున్న నేటితరం సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి( Kushendar Ramesh Reddy).హైదరాబాద్ లో పుట్టిపెరిగిన మన తెలుగోడే ఈ కుశేందర్ రమేష్ రెడ్డి. చిన్నతనం నుంచే ఫోటోగ్రఫీ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన కుశేందర్ ఇప్పుడు బారీ సినిమాలకు డిఓపి గా పని చేస్తూ అటు ప్రేక్షకుల ఇటు విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు. స్కూల్ డేస్ నుండి తనకి ఫోటోగ్రఫీ పైన ఆసక్తి !ఒక కెమెరా కొనుక్కునేలా చేసింది, తన కెమెరాలో బంధించిన ఫోటోలకు పలువురి ప్రశంసలు కురిపించేలా చేసింది. ఆ ఆసక్తితో చిన్న కెమెరా పట్టుకున్న చేతులు ఇష్టంతో పెద్ద కెమెరా పట్టుకునే స్థాయికి వెళ్లి ఫోటోగ్రఫీ తన ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. కేకే సెంథిల్ దగ్గర 'ఈగ' ,'బాహుబలి 1','బాహుబలి 2' అలాగే 'ఆర్ఆర్ఆర్' కి చీఫ్ అసోసియేట్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ సెకండ్ కెమెరాకి ఆపరేటర్ గా కూడా పనిచేసే స్థాయికి ఎదిగి భారీ సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు.ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఒక భారీ టీవీ సిరీస్ తో పాటు ఆడ్ ఫిలిమ్స్ కూడా చేశారు . 2022 లో కీరవాణి గారి అబ్బాయి శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన 'బాగ్ సాలే' మూవీతో తన కెరీర్ ని మొదలుపెట్టి ,రీసెంట్ గ వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' తో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.చరిత్ర చీకటిలో కప్పబడిన ఒక కన్నీటి గాధని 'రజాకార్'(Razakar) సినిమా గా మలిచిన దర్శకుడు యాటా గారి ఆలోచనని దృశ్యకావ్యంగా మలిచే క్రమంలో ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నట్టుగా, అప్పటి చరిత్ర ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా తన సినిమాటోగ్రఫీతో అందరి కళ్ళు చెమర్చేలా తన విజువల్స్ మాట్లాడుతున్నాయని ప్రేక్షకులు చెప్పుకునే స్థాయికి ఎదిగారు.ప్రస్తుతం గ్లిమ్ప్స్ మరియు టీజర్ తో మంచి బజ్ అందుకున్న వానర సెల్యూలాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న 'బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా SSS ప్రొడక్షన్ హౌస్ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని, తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని ఉందని మీడియాతో చెప్పుకొచ్చారు.