breaking news
kota satyanarayana
-
'మోదీ, చంద్రబాబుకు పాలించే అర్హత లేదు'
అనంతపురం: నల్ల కుబేరులను, ఆర్థిక నేరస్తులను దగ్గర పెట్టుకుని సాధారణ ప్రజలను బజారుపాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడుకు పాలించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విమర్శించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్ ధన్ ప్రతి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ఓట్లు వేయించుకొని ప్రజల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు రాక వృద్దులు, ఉపాధి బిల్లులు సకాలంలో అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కష్టార్జితంతో వస్తున్న డబ్బులను కూడా తీసుకోలేని దుర్బర పరిస్థితులు సామాన్యులకు ఉంటే... నల్లకుబేరులు మాత్రం వందల కోట్ల నోట్లు మార్పిడి చేసుకోవడం బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏ పాటితో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమణ, వాసు, వశికేరి శివ, కొండారెడ్డి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో సిలిండర్ విస్ఫోటనం
పసిపాప దుర్మరణం, 18 మందికి గాయాలు సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. 23వ వార్డు రంగిరీజువీధిలోని కొప్పుల ఈశ్వరరావు ఇంట్లో కోట సత్యనారాయణ అద్దె ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాసన వస్తుండగా సత్యనారాయణ కోడలు గమనించి మామకు చెప్పింది. ఆయన సమీపంలోని పకోడి బండి వర్తకుడు కొల్లి సూరిబాబును పిలిచి సిలిండర్ పరిశీలించాల్సిందిగా చెప్పి బయటకు వెళ్లిపోయాడు. సూరి బాబు వచ్చి సిలిండర్‌కు ఉన్న పిన్ను సరిచేస్తుం డగా గ్యాస్ ఒక్కసారిగా లీకై పేలుడు సంభవిం చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఎదురుగా ఉన్న ఇంటి పైకప్పు రేకులు కూలి ఆ ఇంట్లో నిద్రిస్తున్న రెండు నెలల పసిబిడ్డపై పడడంతో ప్రాణాలు విడిచింది. పేలుడు జరిగిన ఇంట్లో ఒకే కుటుంబానికి చెం దిన కోట వరలక్ష్మి, బుజ్జి, పిల్లలు కోట పూజిత, కోట చందినీ(రెండున్నరేళ్లు), జయరాంతో పాటు గ్యాస్లీక్ను అరికట్టేందుకు వచ్చిన సూరి బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమా ని కొప్పుల ఈశ్వరరావుతో పాటు స్థానికులు 11మంది కూడా గాయాలపాలయ్యారు. వీరందిరినీ వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విష యం తెలియగానే మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కేజీహెచ్‌కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫోన్ ద్వారా మంత్రి గంటాతో మాట్లాడారు. తీవ్రంగా గాయపడ్డ వారిని కేజీహెచ్ నుంచి సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, పేలుడు ధాటికి పరిసర భవనాల గోడలు విరి గిపడ్డాయి. ఇళ్లపైకప్పు రేకులు నేల కూలాయి.