breaking news
iti exams
-
అక్కడి వారిక్కడ.. ఇక్కడి వారక్కడ
సాక్షి, వరంగల్ రూరల్: ‘‘మా విద్యార్థులు మీ కళాశాలలో పరీక్ష రాస్తారు.. మీ విద్యార్థులు మా కళాశాలలో పరీక్ష రాస్తారు.. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మా వారికీ అక్కడ ఏమీ ఇబ్బంది ఉండవద్దు’ ఇదీ.. ప్రైవేటు ఐటీఐ కళాశాల యాజమా న్యాల ముందస్తు ఒప్పందం. డైరెక్టరేట్ జనరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ (డీజీఈటీ), డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ (డీజీటీ)ల ఆధ్వ ర్యంలో ఇండస్ట్రియల్ ట్రెనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) పరీక్షలు నిర్వ హిస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేట్ ఐటీఐలు 222 ఉన్నాయి. వీటిలో 58,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్ పరీక్షల కోసం 125 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ముందస్తు ఒప్పందం ప్రకారం పరీక్షలు చూచిరాతను తలపిస్తున్నాయి. పరస్పర ఒప్పందంతో.. వరంగల్ అర్బన్ జిల్లాలోని విద్యార్థి ఐటీఐ, విన్సెంట్ ఐటీఐ విద్యార్థులకు శ్రీ రాజీవ్ గాంధీ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. శ్రీ రాజీవ్ గాంధీ ఐటీఐకి చెందిన విద్యార్థులకు విన్సెంట్ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మ్యూచువల్ చేంజ్‌గా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగానే ఉన్నతాధికారులతో ఒప్పందం కుదుర్చుకుని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయించుకున్నారు. మా విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తే ఇక్కడ మీ విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారులతో ప్రైవేట్ యాజమాన్యాలు కుమ్మక్కై మ్యూచు వల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్ ఐటీఐలకు సెల్ఫ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మ్యూచువల్ చేంజ్‌తో కేం ద్రాలు ఏర్పాటు కావడంతో జోరుగా మాస్‌కాపీయింగ్ జరు గుతోంది. పరీక్ష కేంద్రంలో కనీస నియమాలు సైతం పాటించడం లేదు. జంబ్లింగ్ కాకుండా ఒకే ట్రేడ్ వారిని పక్కపక్కన కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తు న్నారు. కనీస సౌకర్యాలు లేకు న్నా సైతం కొన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని వీఎన్ఆర్ ఐటీఐలో సాధారణ కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు రాయిస్తున్నారు. ఆ ఐటీఐ భవనం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పైసా వసూల్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు చూసి రాసుకునేందుకు ప్రైవేట్ ఐటీఐల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. పైసలు ఇస్తే పాస్ గ్యారంటీ పేరుతో ప్రైవేట్ ఐటీఐలు డబ్బులు వసూల్ చేస్తు న్నాయి. సెంటర్ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూళ్లు చేసినట్లు తెలిసింది. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఏకంగా బోర్డుల పైనే జవాబులు రాస్తున్నారు. ఐటీఐ చేసిన వారికి ట్రాన్స్‌కో, జెన్ కో, సింగరేణిలో ఉద్యోగ అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు కూడా పాస్ అవుతాం కదా అని డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడటంలేదని సమాచారం. విద్యార్థుల నుంచి వసూల్ చేసిన డబ్బులను పరీక్ష పర్యవేక్షకుడికి, ఉన్నత అధికారులకు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వని విద్యార్థులను మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. -
ఐటీఐ పరీక్షల్లో గందరగోళం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఐటీఐ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. మోటార్ మెకానిక్ ప్రశ్నాపత్రం బదులు అధికారులు ట్రాక్టర్ మెకానిక్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీంతో పరీక్షలు ఆగిపోయాయి. ప్రశ్నాపత్రాలను హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ ద్వారా తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. -
ఐటీఐ పరీక్ష ఆగమాగం
ప్రశ్నపత్రాల కొరతతో పక్కకేంద్రాలకు పరుగులు జిరాక్స్ కోసం కేంద్రం దాటిన ప్రశ్నపత్రాలు.. సెమిస్టర్పై అవగాహన కల్పించని నిర్వాహకులు హాల్‌టికెట్ల కోసం సెంటర్ల వద్దే బేరసారాలు భద్రాచలం, న్యూస్‌లైన్: ఐటీఐ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంపై ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు సరైన అవగాహన కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానం ఆదిలోనే అభాసుపాలైంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి ఐటీఐ పరీక్షలు ప్రారంభయ్యాయి. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న క్రాంతి ఐటీఐ, శ్రీ రామ, పవన్ ఐటీఐల విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు. భాగ్యలక్ష్మి, సారపాకలోని రామభద్ర ఐటీఐ విద్యార్థులు పాలిటె క్నిక్ కళాశాలలో పరీక్ష రాశారు. సెమిస్టర్ విధానంలో భాగంగా రెండు రోజులు రెండేసి పేపర్ల చొప్పున ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్, వైర్మన్, కోపా, డీఎం సివిల్ తదితర ట్రేడ్లకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్షలు ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ షీట్లో సర్కిల్స్‌ను దిద్దేందుకు బ్లాక్‌బాల్ పాయింట్ పెన్నునే ఉపయోగించాలనే నిబంధన విధించారు. ఇన్విజిలేటర్ సూచించినా పలువురు విద్యార్థులు దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాలామంది బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను తీసుకురాలేదు. నిర్వాహకులు అప్పటికప్పుడు బయటినుంచి తెప్పించి ఇచ్చారు. సెమిస్టర్ విధానంపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఇన్విజిలేటర్లు అన్నారు. కేంద్రాల వద్దే హాల్‌టికెట్ల పంపిణీ భద్రాచలంలో పలు ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు కేవలం ఫీజుల కోసమే విద్యార్థులను కాలేజీలో చేర్పించుకుంటున్నట్లు మంగళవారం ప్రత్యక్షంగా రుజువైంది. పరీక్షకేంద్రాల వద్దే కొన్ని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే హాల్‌టికెట్లు ఇచ్చారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు కేవలం కళాశాలల తనిఖీ, పరీక్షల సమయంలోనే కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ముందస్తు ఒప్పందంలో భాగంగానే నిర్వాహకులు ఇలా చేస్తుంటారని విద్యార్థులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పరీక్షల ముందురోజు నాటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వాల్సి ఉండగా..ఫీజుల కోసం కొన్ని కళాశాలల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో బేరసారాలు ఆడుతూ కనిపించారు. అప్పటికప్పుడు ఎంతోకొంత ఇచ్చినవారికే హాల్‌టికెట్లు అందజేశారు. ప్రశ్నపత్రాల కొరతతోఇన్విజిలేటర్ల పరుగులు ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్ ప్రశ్నపత్రాలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాకపోవడంతో ఇన్విజిలేటర్లు వాటికోసం పరుగులుతీయాల్సి వచ్చింది. పక్క పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రశ్నపత్రాలను తెచ్చారు. ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు అసలే రాకపోవడంతో ఆ విభాగం విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో రెండుసెంటర్లలో గైర్హాజరైన విద్యార్థుల ప్రశ్నపత్రాలను వీరికి అందజేశారు. ఇలా సర్దుబాటు చేసినా పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విభాగం పేపర్లు 37 తక్కువ రావడంతో...ఓ పేపర్ తీసుకెళ్లి జిరాక్స్ తీయించి విద్యార్థులకు పంపిణీ చేశారు. డిగ్రీ కళాశాలలో డిక్టేషన్..? ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నిర్వాహకులతో ముందస్తు ఒప్పందం నేపథ్యంలో విద్యార్థులకు జవాబులు డిక్టేట్ చేసినట్లు తెలిసింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా చెప్పుకునే ఓ వ్యక్తికి ప్రైవేటు ఐటీఐ కళాశాలల నిర్వాహకులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందు ఐటీఐ నిర్వాహకుల వాహనంలోనే సదరు అధ్యాపకుడు నేరుగా కేంద్రంలోకి రావటం గమనార్హం. పేపర్లు ఆసల్యంగా రావటంతోనే సమస్య: ఎం. మురళీకృష్ణ, పరిశీలకులు ప్రశ్నపత్రాలు ఆలస్యంగా వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాయి. మంగళవారం ఉదయం వెళ్లి తెచ్చుకున్నాం. పేపర్లు తక్కువగా వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. గైర్హాజరైన విద్యార్థుల పేపర్లు సర్దుబాటు చేశాం.