breaking news
Islamic group
-
పాపులర్ ఫ్రంట్‌పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
తాలిబన్ల ‘కే’ తలనొప్పి
తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి పరిణామాలు తాలిబన్లకు కలిగిస్తున్న ఆనందాన్ని ఐసిస్–కే దాడులు ఆవిరిచేస్తున్నాయి. ఘనీ ప్రభుత్వం దిగిపోయినందుకు ఆనందించాలా? ఆ ప్రభుత్వ స్థానంలో కూర్చోబోతున్న తమకు ఎదురవుతున్న సవాళ్లకు భయపడాలా? అర్థం కాని పరిస్థితి తాలిబన్లలో నెలకొంది. ఐసిస్–కే నిర్వహించిన కాబూల్‌లో బాంబు దాడి, ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడులు వంటివి తాలిబన్లను ఆందోళన పరుస్తున్నాయి. తాలిబన్లు కూడా ఐసిస్–కే లాగానే షరియాకు కట్టుబడి పాలన సాగించే గ్రూపు. మరి అలాంటప్పుడు వీరితో వారికి ఎందుకు వైరం వస్తుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు ఇరు గ్రూపుల లక్ష్యంలో భేదాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు ) 2015లో బీజాలు అఫ్గాన్‌లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్– ఖొరసాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిస్ 2015లో ప్రకటించింది. వెంటనే ఈ గ్రూపుపై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు. తాలిబన్లు అఫ్గాన్‌లో షరియా ఆధారిత పాలనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆవిర్భవించిన గ్రూపు. తాలిబన్ల ఎజెండా అఫ్గాన్‌కే పరిమితం. విదేశీయుల నుంచి అఫ్గాన్‌కు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటారు. కానీ ఐసిస్ లక్ష్యం అఫ్గాన్‌తో ఆగదు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అన్ని ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీఫత్ (ఇస్లామిక్ రాజ్యం) ఏర్పాటు ఐసిస్ ప్రధాన లక్ష్యం. ఇందువల్లనే తాలిబన్లకు, ఐసిస్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలని, అఫ్గాన్‌లో ఆధిపత్యం కోసం పాక్ సృష్టించిన గ్రూపని ఐసిస్ విమర్శిస్తోంది. పాక్ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసిరావాలని తాలిబన్లను ఐసిస్–కే డిమాండ్ చేసింది. ఐసిస్–కే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. అఫ్గాన్‌లో జిహాద్‌కు తాము సరిపోతామని, సమాంతరంగా మరో గ్రూపు అవసరం లేదని, ఐసిస్–కే తమ కార్యకలాపాలను నిలిపివేసి అఫ్గాన్ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మండిపడ్డ ఐసిస్ ఖలీఫత్‌లో చేరని కారణంగా తాలిబన్లపై జాలి చూపవద్దని ఐసిస్–కేను ఆదేశించింది. మొత్తం ఖలీఫత్‌కు ఒకరే అధినేత (ఖలీఫా/అమిర్) ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్‌ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015లోనే పిలుపిచ్చింది. (చదవండి: వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు) ఏం జరగవచ్చు ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్‌లో చాలా భాగం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. దేశంలో సుదీర్ఘ పౌరపోరాటానికి ఈ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విమానాశ్రయం వద్ద బాంబుదాడులు జరిపింది. అమెరికా దళాలు వైదొలిగాక ఈ గ్రూపు మరిన్ని దాడులు చేయవచ్చన్న భయాలున్నాయి. ఐసిస్–కేను తాము ఎదుర్కొంటామని, అమెరికా సాయం అవసరం లేదని, అందువల్ల అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణను జాప్యం చేయాలని ఐసిస్ భావించింది. దీనివల్ల తాలిబన్లు– అమెరికన్ల పైనే ఎక్కువగా దృష్టిపెట్టి బిజీగా ఉంటారని, ఈ మధ్యలో తాము పైచేయి సాధించవచ్చని ఐసిస్ యోచిస్తున్నట్లు రక్షణ నిపుణుల అంచనా. ఇస్లాం ఆచరణలో తేడాలు తాలిబన్లు, ఐసిస్ గ్రూప్ రెండూ జీహాద్ ద్వారా ఇస్లామిక్ సామ్రాజ్య ఏర్పాటుకు యత్నించేవే అయినా, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో రెండు గ్రూపుల మధ్య బేధాలున్నా యి. తాలిబన్లలో ప్రధానంగా ఫష్తూన్ తెగకు చెందిన వారుంటారు. వీరు సున్నీ ఇస్లాంకు చెందిన హనఫీ మార్గాన్ని అవలంబిస్తారు. తాలిబన్లు దియోబంది మార్గ ప్రవచనాలను పాటిస్తారు. ఐసిస్ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫి మార్గాన్ని పాటిస్తుంది. సూఫీ మార్గంపై తాలిబన్లకు నమ్మకం ఉండగా, ఐసిస్‌కు సూఫిజం గిట్టదు. ఇస్లాంలో మరో వర్గం షియా ముస్లింలను ఐసిస్ కాఫిర్లు(ద్రోహులు)గా భావిస్తుంది. సూఫీ మార్గాన్ని తిరస్కరిస్తూ ఐసిస్ ఫత్వాలు జారీ చేయగా, ఐసిస్‌ను వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఫత్వాలు జారీ చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆరు ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసిన ఉగ్రవాదులు
బ్యాంకాక్: ఇప్పటి వరకు భౌతిక దాడులకు దిగుతున్న ఉగ్రవాదులు ఇప్పుడు సాంకేతిక పరమైన దాడులకు దిగుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బ్యాంకాక్‌కు చెందిన ఆరు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ట్యునీషియా నుంచి ఈ చర్యకు పాల్పడింది. ఈ సైట్లను తెరిచి చూసేవారికి రోహింగ్యా ముస్లింల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఫల్లాగ్ గస్సిర్ని అండ్ డాక్టర్ లామౌచి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మీ సైట్లను ట్యునిషియా నుంచి తామే హ్యాక్ చేశామని అందులో పేర్కొన్నారు. 'మీరు మా ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మాదంతా ఫల్లాగా బృందం. మొత్తం ముస్లింలమే. మేము శాంతియుతంగా ప్రజలను ప్రేమిస్తాం' అని కూడా అందులో పేర్కొన్నారు. గతంలో కూడా వీరే ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై థాయిలాండ్ సాంకేతిక శాఖ మంత్రి స్పందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సైట్లపై హ్యాకింగ్ దాడులు జరగడం సర్వ సాధారణమైందని, సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.