breaking news
India Under-19 cricket captain
-
సెంచరీ మిస్ చేసుకున్న ఆయుశ్ మాత్రే
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్‌లో భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 90 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. మాత్రే సెంచరీ మిస్ అయినా మరో భారత యువ ఆటగాడు విహాన్ మల్హోత్రా శతక్కొట్టాడు. విహాన్ 123 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడో రోజు రెండో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. కనిష్క్ చౌహాన్ (7), నమన్ పుష్పక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.ఆయుశ్ మాత్రే వికెట్ కోల్పోయాక టీమిండియా 85 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. మాత్రే, విహాన్ క్రీజ్‌లో ఉండగా టీమిండియా భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రాల్ఫీ ఆల్బర్ట్ (15-2-53-6) టీమిండియా బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. మాత్రే, విహాన్ ఔటయ్యాక నలుగురు బ్యాటర్లు (అభిగ్యాన్ కుందు, రాహుల్ కుమార్, అంబరీష్, హెనిల్ పటేల్) డకౌట్ అయ్యారు. మధ్యలో హర్వంశ్ పంగాలియా (28) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (20) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ థామస్ ర్యూ అర్ధ శతకం (59)తో మెరవగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ మింటో (46) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 4, ఆదిత్య రావత్, అంబరీష్ తలో 2, హెనిల్ పటేల్, విహాన్ మల్హోత్రా చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీనికి ముందు జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ సెంచరీ సహా పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. -
గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్
అండర్ 19 వరల్డ్‌కప్-2024ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా మాజీ విజేత బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన గ్రూప్ 'ఎ' తొలి లీగ్ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో మాటల యుద్ధానికి సహారాన్ దిగాడు. అంతలోనే మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలవడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకునేంత పనిచేశారు. అయితే అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 25 ఓవర్లో చోటు చేసుకుంది. అయితే సహారాన్ కోపానికి గల కారణమేంటో తెలియలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సహారన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ యువ జోడీ మూడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదర్శ్ సింగ్(76), ఉదయ్ సహారన్(64) పరుగులు చేశారు. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు pic.twitter.com/fmqCEQ5ipB — Sitaraman (@Sitaraman112971) January 20, 2024 -
భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ అరెస్ట్
పట్నా: అండర్-19 ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఆటోను ఢీకొట్టిన కేసులో భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను పట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కిషన్ వేగంగా కారును నడుపుతూ ఆటోను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. అంతేగాక ప్రమాద స్థలంలో కిషన్ ఘర్షణకు దిగాడు. దీంతో స్థానికులు కిషన్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కిషన్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. బిహార్‌లోని నవడా జిల్లాకు చెందిన కిషన్.. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో పది మ్యాచ్‌ల్లో 736 పరుగులు చేశాడు. దీంతో గత డిసెంబర్లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నెల 27న బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచ కప్ ఆరంభకానుంది. ఈ తరుణంలో కిషన్ అరెస్ట్ కావడంతో భారత జట్టుకు ప్రతికూలంగా మారింది.