breaking news
Highway junction
-
శరవేగంగా అమరావతి..
సాక్షి, నూజెండ్ల(గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్న అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రణాళికలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పనుల కోసం రూ.100 కోట్లను బడ్జెట్లో కేటాయించడంతో ఒక్కసారిగా పనుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు దశల వారీగా సమీక్ష సమావేశాలు, హైవే నిర్మాణంలో అనుమానాలపై నివృత్తి చేస్తూ జంక్షన్ బాక్స్‌ల వివరాలు తెలియజేశారు. దీంతో ఇకపై నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పనులు నత్తనడకన సాగడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండో సంతకమే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో విషయం తెరమీదికి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైవే నిర్మాణంపై చర్చ జరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ హైవే వెళ్లేది ఇలా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా నంద్యాల, గిద్దలూరును కలుపుకుంటూ గుంటూరు వరకు రహదారిని రూ.25వేల కోట్లతో 557కిలో మీటర్ల మేర అధునాతన సాంకేతికతో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పేరిట గతంలో ఒప్పందాలు జరిగాయి. 2015 నుంచి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. అయితే, ఎన్హెచ్ఏఐకి రోడ్డు నిర్మాణ పనులు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలు పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. నిర్మాణాన్ని కేంద్రం చేపట్టినట్లయితే వివాదాలు లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే, కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న ఈ హైవే ప్రస్తావన తెరపైకి రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 150 ఎకరాల లోపే జంక్షన్ బాక్స్‌లు సుదీర్ఘమైన అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో మూడు చోట్ల జంక్షన్ బాక్స్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, గతంలో జంక్షన్ బాక్స్‌లకు 250 ఎకరాలకు పైగా భూములు సేకరించాలని నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది లైన్ల రహదారిని నాలుగు లైన్లకు కుదించింది. దీంతో పాటు నూజెండ్ల జంక్షన్ బాక్స్‌కు 158.67 ఎకరాలు, కావూరు 130 ఎకరాలు, మేడికొండూరు 128 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల సేకరణకు స్వస్తి పలుకుతూ 150 ఎకరాల లోపే జంక్షన్ బాక్స్‌లు కుదించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే సాధ్యం సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని,అసెంబ్లీలో అద్భుతమైన బిల్లులు తీసుకువచ్చి సామాజిక న్యాయం కోసం బాటలు వేశారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డేరంగుల ఉదయకిరణ్ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. నిధుల్లో, నియామకాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీలకు, మహిళలకు 50 శాతం కేటాయించిన తీరు ప్రశంసనీయమన్నారు. ప్రాథమిక విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఆయన అనుచరులు భయపడుతున్నారని, పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్న జగన్మోహన్రెడ్డి విధానాలు దేశంలో ఎందరికో ఆదర్శనీయమని తెలిపారు. చంద్రబాబునాయుడు కాపులకు, బీసీలకు మధ్య శత్రుత్వం సృష్టించి స్వార్థ రాజకీయాలకు కాపులను మోసం చేసి పబ్బం గడుపుకొన్నారని ఎద్దేవా చేశారు. వడ్డెర, వాల్మీకి, బెస్త, రజక, కురుబ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతానని ఐదేళ్లు కాలయాపన చేసి పంగనామాలు పెట్టిన చంద్రబాబుకు ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు.ఊసరవెల్లిలా రంగులు మార్చడం చంద్రబాబుకు అలవాటేనని, వడ్డెర కులానికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో న్యాయం జరుగుతుండడంతో ఓర్వలేక చంద్రబాబు వారిపై కపట ప్రేమ చూసిస్తున్నారని పేర్కొన్నారు. -
హైవే జంక్షన్‌గా నకిరేకల్
నకిరేకల్ పట్టణం జాతీయ రహదారుల జంక్షన్‌గా మారనుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ పట్టణం మీదుగా కొత్తగా సిరోంచ టు రేణిగుంట జాతీయ రహదారి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పనులు సర్వే దశలో ఉన్నాయి. రహదారి పూర్తయితే నకిరేకల్ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నకిరేకల్ జాతీయ రహదారుల కూడలిగా మారనుంది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్ మరో హైవేకు కేంద్ర బిందువు కానుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరిచేం దుకు గత యూపీఏ ప్రభుత్వం మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు వయా తెలంగాణ మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు 643 కిలోమీటర్ల మేరగల ఈ హైవే జిల్లాలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. దీంతో ఆయా ప్రాంతాలతో పాటు నకిరేకల్ పట్టణం కూడా అభివృద్ధి చెందనుంది. హైవే నిర్మాణం ఇలా.. సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారిని రెండు భాగాలు విభజించారు. సిరోంచ నుంచి నకిరేకల్ వరకు(365 హైవే), నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు(369 హైవే) నిర్మించనున్నారు. కాగా సిరోంచ నుంచి నకిరేకల్ వరకు గల 365 నంబర్ హైవే తుంగతుర్తి మండలంలో ప్రారంభమై అర్వపల్లి, శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి నకిరేకల్ వరకు 72.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే 369 నంబర్ హైవే నకిరేకల్ నుంచి నల్లగొండ(తాటికల్), నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లలోకి ప్రవేశిస్తుంది. ఇది జిల్లాలో 86.2 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నిర్మాణం.. సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీదుగానే సాగుతుంది. దీంతో ఆయా గ్రామాలు, మండల కేంద్రాలు అభివృద్ధి చెందనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలకు గ్రామాల నుండే నేరుగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముమ్మరంగా సర్వే పనులు రోడ్డు నిర్మాణంలో భాగంగా హైవే అథారిటీ ఆధ్వర్యంలో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారి మధ్య నుంచి ఇరువైపులా 45ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టేందుకు సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తికాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఎగుమతులు, దిగుమతులకు ఊతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ చేపడుతున్న జాతీయ రహదారితో ఆయా రాష్ట్రాలలో సరుకుల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా జిల్లాకు మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, వెల్లులి, జొన్నలు, కందులు దిగుమతి అవుతున్నాయి. అలాగే జిల్లాలో అధికంగా పండిస్తున్న పత్తి, బత్తాయి, నిమ్మ ఎగుమతి చేస్తున్నారు. హైవే నిర్మాణంతో రవాణా ఖర్చుల భారం తగ్గడంతో పాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపార, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.