breaking news
Eyelids
-
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్‌కు చెందిన గీతాబెన్‌కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్‌కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్‌కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?) -
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలకై ఈ డివైస్..!
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలు, నిండైన కనురెప్పలే కళ్లకు అందం. కనురెప్పలు పెద్దగా అందంగా ఉంటే ముఖం కళగా కనిపిస్తుంది. అందుకే చాలామంది కనురెప్పలకు త్రీడీ ఐలాష్లను అతికించుకుంటారు. అయితే చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ డివైస్ ఇంట్లో ఉంటే, ప్రత్యేకంగా ఐలాష్‌లు కొని అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో సహజంగా ఉన్న కనురెప్పలనే మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్ మెషిన్ చార్జింగ్‌తో నడుస్తుంది. దీన్ని ముందే ఆన్ చేసి, హీట్ చేయాలి. అనంతరం కనురెప్పలకు అమర్చి ఉంచితే, అదే ఆ వెంట్రుకలను స్టైటెనింగ్ చేసి, కర్లింగ్ చేస్తుంది. దీంతో కనురెప్పలపై వెంట్రుకలు ఒంపులు తిరిగి పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఈ మెషిన్‌ను 10 సెకన్లలో ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీనిలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. సెన్సింగ్ సిలికాన్ ప్యాడ్‌తో రూపొందిన ఈ డివైస్ చర్మానికి, కళ్లకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వేడి ఎక్కువ కావడం, చర్మం కాలడంలాంటి సమస్యలు ఉండవు.దీనిలోని ఒక మోడ్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 149 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ గ్రీన్ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. అలాగే మరో మోడ్ 85 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 185 డిగ్రీల ఫారెన్ హీట్‌తో బ్లూ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. ఈ సెకండ్ మోడ్ ఆప్షన్ బిరుసైన వెంట్రుకలకు అనుకూలంగా ఉంటుంది. మోడ్‌లను మార్చడానికి డివైస్ పైభాగంలో సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇనొవేటివ్ హీటింగ్ ఫంక్షన్ తో కూడిన ఈ ఎర్గోనామిక్ డిజైన్.. వినియోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇది పోర్టబుల్, కాంపాక్ట్ కూడా. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బ్యూటీ కిట్, కాస్మెటిక్ బాక్స్ లేదా ట్రావెల్ కేస్‌లో సులభంగా అమరిపోతుంది. ఈ డివైస్‌తో కనురెప్పలను కర్ల్ చేసుకుని, అనంతరం మస్కారా, ఐలైనర్ వంటివి వేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి? -
'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!
ఎన్నో వింత వ్యాధులు. ఎందుకొస్తాయో తెలియదు. వాటి వల్ల అనుభవించే బాధ అంత ఇంత కాదు. బయటపడటం కూడా అంత ఈజీ కూడా కాదు. వైద్య శాస్త్రనికే సవాళ్లు విసిరే విచిత్రమైన వ్యాధులు రోజుకోకటి చొప్పున పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్వయంకృతాపరాధమో మనిషి స్వార్థానికి పరాకాష్ట అనాలో తెలియదు. అలాంటి వింత వ్యాధినే ఇక్కడొక మహిళ ఎదుర్కొంటోంది. రోజురోజుకి పరిస్థితి దారుణంగా మారిందే తప్ప తగ్గలేదని బోరుమని విలపిస్తోంది. ఆ మహిళకు వచ్చిన వింత వ్యాధి ఏంటీ? ఎందువల్ల అంటే.. అమెరికాలో ప్రముఖ నటి జీనత్ అమన్ నాలుగు దశాబ్దాలుగా ప్టోసిస్ అనే పరిస్థితితో బాధపడుతోంది. కొన్నేళ్ల క్రితం కంటికి తగిలిన గాయమే ఇందుకు కారణం. ఆమె కుడి కన్నుకు ఏర్పడిన గాయం కారణంగా ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత క్రమేణ కంటి రెప్ప కుంగిపోవడం లేదా కిందకు వాలిపోవడం జరిగింది. అలా పూర్తిగా కిందకు వచ్చేస్తోంది. అది ఆమె కంట్రోల్ లేదు. అంటే కనురెప్పను కదల్చలేదు. దీని వల్ల కనుచూపు తగ్గిపోతూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ చేయించకున్న తన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఇన్‌స్ట్రాగాం వేదికగా వాపోయింది. ఇంతకీ ప్టోసిస్ అంటే ఏంటీ.. ప్లోసిస్ అంటే 'డ్రూపింగ్ కనురెప్ప' అని అంటారు. దీని కారణంగా ఎగువ కనురెప్ప కుంగిపోవడం లేదా వైద్య పరిభాషలో స్థానభ్రంశం చెందడం అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ ప్రకారం ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు కనురెప్పలను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టిని ప్రభావితం చేయొచ్చు లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవచ్చు. ఈ పరిస్థితి వయస్సు సంబంధిత మార్పలు కారణంగా గానీ కండరాల బలహీనత లేదా నరాల బలహీనత/ పుట్టుకతో వచ్చే వివిధ సమస్యలు కారణం కావచ్చు. ప్టోసిస్ లక్షణాలు.. కనురెప్పలు వంగిపోవడం స్పష్టంగా చూడలేకపోవడం కనురెప్పలు పైకి లేపాలంటే భారంగా అనిపించడం కన్ను తెరవడమే కష్టంగా ఉండటం దైనందిన పనులు చేసుకోవడం కూడా కష్టమవ్వడం తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే కంటి నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. (చదవండి: మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..) -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
కాంతిమంతమైన కళ్లకోసం..
బ్యూటిప్స్ కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్ చేసి, కాటన్‌ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్‌లో వుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్‌ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి కనురెప్పలు పొడవగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్ ఆయిల్‌ని అప్లై చేయాలి. రెప్పలు రాలిపోకుండా దృఢంగా అవతాయి. నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగావూరి, మెరుస్తాయి. -
కనురెప్పలు మరింత విశాలంగా!
బ్యూటిప్స్ కనురెప్పలు విశాలంగా కనిపించాలంటే రెప్పల వెంట్రుకలు దళసరిగా ఉండాలి. అందుకు..రాత్రి పడుకునే ముందు ఆముదం కొద్దిగా వేలికి అద్దుకొని కనురెప్పల వెంట్రుకలకు మెల్లగా రాయాలి.మస్కారా వల్ల కనురెప్పల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అలొవెరా జెల్‌ను రాసుకోవాలి. అలొవెరాలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కనురెప్పల వెంట్రుకల పెరుగుదలకు దోహదం చేస్తుంది. రోజూ 2 నిమిషాలు ఆలివ్ ఆయిల్‌తో కనురెప్పల భాగంలో మృదువుగా మర్దనా చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది. విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్‌లోని ఆయిల్‌ను శుభ్రమైన మెత్తటి బ్రష్‌తో అద్దుకొని, మెల్లగా అప్లై చేయాలి. దీని వల్ల కనురెప్ప వెంట్రుకంతటికీ ఆయిల్ అంది, ఆరోగ్యమైన ఎదుగుదల ఉంటుంది.


