breaking news
Deputy Warden
-
గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డెన్ దారుణం.. విద్యార్థిని తంతూ, కొడుతూ..
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. డార్మేటరీ రూమ్‌కు వెళ్లాడని.. తాను చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో.. విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ కొట్టాడు. రాజును కిందపడేసి కాళ్లతో తంతు పిడిగద్దులు కురిపించాడు. విద్యార్థి ప్రాదేయపడ్డా కూడా కనికరించకుండా మరింతగా రెచ్చిపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. కాలేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో... డిప్యూటీ వార్డెన్ నయీమ్‌పై విచారణ చేపట్టారు. విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను సస్పెండ్ చేశామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీద్ తెలిపారు. బాధిత విద్యార్థి రాజు స్వస్థలం జమ్మికుంట అని పేర్కొన్నారు. చదవండి👇 లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. హరీష్‌రావు రియాక్షన్ ఇది సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి -
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ వార్డెన్ మృతి
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఇంటి ఎదుట నిలబడిన డిప్యూటీ వార్డెన్‌ను తాగిన మైకంలో టాటా ఏస్ వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డిప్యూటీ వార్డెన్‌గా పనిచేస్తున్న పోడెం ఆనందరావు(45)కు రెండు రోజులుగా జ్వరం వస్తోంది. చికిత్స చేయించుకోవడానికి కుమారుడు జీవన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై మండల కేంద్రానికి వెళ్లాడు. అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటి ఎదుట నిలబడి ఉన్న ఆనందరావును తాగిన మైకంలో టాటా ఏస్ వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో నోట్లో నుంచి రక్తం పడింది. కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వెంటనే ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యుడు ఆనందరావు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వరంగల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆనందరావు కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మంగపేట మండలం కోమటిపల్లి బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్‌గా ఆనందరావు పనిచేస్తున్నారు. కాగా, టాటా ఏస్ డ్రైవర్ రషీద్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.