breaking news
CEO Pawan Munjal
-
15 హీరో టూవీలర్ల ఆవిష్కరణ
గుర్గావ్: టూ-వీలర్ దిగ్గజం హీరోమోటోకార్ప్ 15 కొత్త వాహనాలను గురువారం ఆవిష్కరించింది. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి కల్లా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. కంపెనీ ఆవిష్కరించిన కొత్త వాహనాల్లో కరిజ్మా ఆర్, జెడ్‌ఎంఆర్, స్ప్లెండర్ ఐ-స్మార్ట్‌లతో పాటు ప్లెజర్ స్కూటర్ మోడల్లో కొత్త వేరియంట్ కూడా ఉంది. ఈ 15 కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ప్రస్తుత పండుగల సీజన్లోనే మార్కెట్లోకి తేనుంది. మరో 35 వాహనాలు: హోండాతో భాగస్వామ్యం నుంచి వీడి సొంతంగా ప్రస్థానం ప్రారంభించి రెండేళ్లే అయిందని ముంజాల్ చెప్పారు. మూడేళ్లలో 50 కొత్త ఉత్పత్తులను అందిస్తామని 2011లోనే ప్రకటించామని, ఇప్పుడు 15 కొత్త వాహనాలనందిస్తున్నామని చెప్పారు., మరో 35ను రానున్న సంవత్సరాల్లో తీసుకొస్తామ న్నారు. డాన్ కన్నా చౌక బైక్ ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో తక్కువ ఖరీదున్న బైక్ హెచ్ఎఫ్ డాన్(ధర రూ.37,000)అని, దీనికంటే తక్కువ ధరకు లభ్యమయ్యేలా కొత్త బైక్‌ను అందించనున్నామని పవన్ ముంజాల్ వివరించారు. ఇక హోండాతో విడివడిన తర్వాత తాము సొంతంగా రూపొందించిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. -
6 నెలల్లో 12 కొత్త మోడళ్లు: హీరో
గుర్గావ్: భారత ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ భారీ ప్రణాళికలకు సిద్ధం అవుతోంది. 2020 కల్లా రూ.60 వేల కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ గురువారం చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం 2020 కల్లా ప్రపంచవ్యాప్తంగా 20 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, 50 కొత్త మార్కెట్లకు విస్తరించనున్నామని వివరించారు. ఆర్నెల్లలో 12 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 10 కోట్ల బైక్‌ల ఉత్పత్తిపై దృష్టి వచ్చే ఏడాదికల్లా మూడు ఖండాల్లో ఆరు అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని పవన్ ముంజాల్ వివరించారు. 5 కోట్లవ బైక్‌ను ఇక్కడి ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 కోట్ల బైక్‌ల ఉత్పత్తిపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఇటీవలే కెన్యాలో బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేశామని, మరికొన్ని విదేశాల్లో కూడా తమ టూవీలర్లను విక్రయించనున్నామని వివరించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా మరిన్ని టూవీలర్ల మోడళ్లను ఆఫ్రికా దేశాల్లో అందించనున్నామని పేర్కొన్నారు. పండుగలపైనే ఆశలన్నీ... గత ఆర్థిక సంవత్సరంలో రూ.24 వేల కోట్ల టర్నోవర్ సాధించామని పేర్కొన్నారు. 2017 కల్లా విదేశాల్లో పదిలక్షల బైక్‌లను విక్రయించడం లక్ష్యమని, ఇది తమ మొత్తం అమ్మకాల్లో 10 శాతమని వివరించారు. 2020 కల్లా తమ టూవీలర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు చేరుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమకున్న మూడు ప్లాంట్ల(గుర్గావ్, దరుహెర, హరిద్వార్) మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 62 లక్షలని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా 12కు పైగా కొత్త మోడళ్లను అందించాలని యోచిస్తున్నామని వివరించారు. కొత్త టూవీలర్ల డిజైనింగ్‌లో తమ ఆర్అండ్డీ సెంటర్ ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు. అమ్మకాలు మందగమనంగా ఉన్నప్పటికీ, పండుగల సీజన్లలో విక్రయాలు జోరుగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక నాలుగో ప్లాంట్‌ను నీమ్రాన(రాజస్థాన్)లోనూ, ఐదో ప్లాంట్‌ను గుజరాత్‌లోనూ ఏర్పాటు చేయనున్నామని కంపెనీ గత ఏడాదే ప్రకటించింది.