breaking news
Bombing case
-
‘కనిష్క’ నిందితుడి హంతకుడికి జీవిత ఖైదు
ఒట్టావా:‘కనిష్క’ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని హత్య చేసిన నేరంలో సుపారీ కిల్లర్ టాన్నెర్ ఫాక్స్‌కు కెనడా కోర్టు జీవిత ఖైదు విధించింది. 20 ఏళ్లపాటు జైలు శిక్ష వేసింది. 2022 జులైలో కనిష్క పేలుడు నిందుతుడు రిపుదమన్సింగ మాలిక్‌ను ఫాక్స్ కాల్చి చంపాడు. మాలిక్‌ను చంపిన కేసులో ఫాక్స్‌తో పాటు అతని అనుచరుడు లోపేజ్ గత ఏడాది అక్టోబర్‌లో నేరం ఒప్పుకున్నారు. మాలిక్‌ను చంపేందుకు తాము సుపారీ తీసుకున్నామని ఫాక్స్ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బులిచ్చింది ఎవరనేది ఫాక్స్ వెల్లడించకపోవడం గమనార్హం. కాగా,1985 జూన్ 23న టొరంటో నుంచి ముంబై వెళుతున్న ఎయిర్ఇండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు గాల్లోనే పేల్చివేశారు. ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఇండియాకు వచ్చి వెళుతున్న కెనడా వాసులే. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడులు జరిగేదాకా కనిష్క బాంబు పేలుడు ఘటననే అత్యంత దారుణ ఉగ్రవాద చర్యగా భావించే వాళ్లు. కాగా, కనిష్క పేలుడు కేసులో విచారణ ఎదుర్కొన్న మాలిక్ నిర్దోషిగా విడుదలయి చివరికి సుపారీ కిల్లర్ ఫాక్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. -
చంద్రబాబుపై బాంబు దాడి కేసు వాయిదా
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన బాంబుదాడి కేసు విచారణను తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి వెంకటనాగేశ్వరరావు ఈనెల 14వ తేదీకివాయిదా వేశారు. కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారి తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో వాదనలు వినిపించారు. వారి వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతివాదనలు వినిపించడానికి న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.