breaking news
Bjr Nagar
-
బంజారాహిల్స్‌లో చైన్‌స్నాచింగ్
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో సోమవారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేఆర్నగర్ బస్తీలో నివసించే యాదమ్మ సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేస్తుండగా మంకీ క్యాప్ ధరించి నడుచుకుంటూ వచ్చిన యువకుడు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల మంగళసూత్రం తస్కరించి పరారయ్యాడు. ఆమె దొంగ దొంగ అంటూ అరుస్తుండగా అక్కడే అద్దెకుంటున్న యువకులు లేచి దొంగ కోసం వెంటపడగా గల్లీలోంచి తప్పించుకొని పారిపోయాడు. ఉదయమే ఇంటి పనులు చేసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న యాదమ్మ తెల్లవారుజామునే ముగ్గు వేస్తుండగా కనిపెట్టిన ఆగంతకుడు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రైం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ఇంట్లో లేని సమయంలో..
బంజారాహిల్స్ (హైదరాబాద్) : భార్య పనికి వెళ్లిన సమయంలో తన ఇంట్లో అద్దెకు ఉండే బాలిక(15)ను బెదిరించి లోబర్చుకొని ఎనిమిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని బీజేఆర్ నగర్లో నివసించే మన్నెల్లి ఆశీర్వాదం(52) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతని ఇంట్లో జయానంద్ కుటుంబం అద్దెకు ఉంటోంది. అతని కుమార్తె (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి ఆశీర్వాదం తన భార్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె నగ్న దృశ్యాలు సెల్ఫోన్లో తీసి బెదిరిస్తున్నాడు. అయితే ఇటీవల ఆశీర్వాదం భార్యకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతనిపై ఐపీసీ సెక్షన్ 376(2), 506, ఫోక్స్ యాక్ట్ 5, 6 కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.