breaking news
AIOCD
-
ఆన్లైన్ ఫార్మసీలకు చెక్!
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్లాంటి దిగ్గజ ప్లాట్‌ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పేకి చెందిన పిన్‌కోడ్ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్ ఫార్మసీ చెయిన్ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. అటు ఓటీపీ వెంచర్స్ నుంచి 2.4 మిలియన్ డాలర్లు సమీకరించిన జీల్యాబ్ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్‌ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్ స్టోర్స్‌తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్ స్టోర్స్ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి. ఔషధాలతో పాటు మెడికల్ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.హోమ్ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్ ఫార్మసీ మార్కెట్ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఆన్లైన్ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్లైన్ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్‌ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్లో లైసెన్సు లేని ఆన్లైన్ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేన్సర్, మధుమేహం ఔషధాలు మరింత ప్రియం!
న్యూఢిల్లీ: కేన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల ధరలు మరింత పెరిగే అవకాశముంది. వాటిని దాదాపు 1.7 శాతం పెంచే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్టు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు మూడు నెలల తర్వాత వర్తింవచ్చని ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ చెప్పారు. ఫార్మా కంపెనీలు ప్రభుత్వం సూచించిన దానికంటే చాలా ఎక్కువకు ఔషధాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. రసాయనాలు, ఎరువుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలోనూ దీన్ని ప్రస్తావించింది. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి 307 ఘటనలు నమోదయ్యాయి. అధిక ధరల వల్ల రోగులు ఔషధాలు కొనలేక అవస్థలు పడుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. జాతీయ అత్యయిక ఔషధాల జాబితా–2022లోని మందుల ధరలను సవరించిన/తగ్గించిన తర్వాత దేశవ్యాప్తంగా రోగుల జేబుకు చిల్లు పడటం తగ్గిందని, రూ.3,788 కోట్ల సొమ్ము ఆదా అయిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మూడు వారాల క్రితం ప్రకటించడం తెలిసిందే. -
ఔషధ విక్రయాలకు రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ విక్రయాలు గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 13 శాతం వృద్ధి చెందాయి. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం నాలుగు మాసాలుగా పరిశ్రమ రెండంకెల వృద్ధి కొనసాగిస్తోందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ వెల్లడించింది. ఆగస్ట్‌లో ఇది 12.1 శాతం నమోదైతే, 2021 సెప్టెంబర్‌లో ఇది 12.6 శాతంగా ఉంది. భారత ఔషధ విపణి యాంటీ–ఇన్ఫెక్టివ్స్, రెస్పిరేటరీ మినహా అన్ని రకాల చికిత్సలలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా మెరుగైన పనితీరును అందించడం కొనసాగించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ధరల్లో 6.6 శాతం పెరుగుదల.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఔషధాల అమ్మకాల పరిమాణం 4.5 శాతం ఎగసింది. నూతన ఉత్పత్తుల రాక 1.9 శాతం పెరిగింది. ధరలు 6.6 శాతం దూసుకెళ్లాయి. తీవ్రమైన జబ్బులకు వాడే ఔషధాల విక్రయాలు 9.2 శాతం పెరిగాయి. మొత్తం పరిశ్రమలో వీటి వాటా 47 శాతం. దీర్ఘకాలిక రోగాలకు వాడే మందులు 16.1 శాతం, మిత, మధ్యస్థ వ్యవధి జబ్బులకు ఉపయోగించే ఔషధాల అమ్మకాలు 17.3 శాతం అధికం అయ్యాయి. గైనకాలజీ సంబంధ మెడిసిన్స్ అత్యధికంగా 24.7 శాతం, హృదయ 18.2, చర్మ, నాడీ వ్యవస్థ సంబంధ మందులు 17.8 శాతం ఎగశాయి. కంపెనీల వారీగా ఇలా.. సెప్టెంబర్ నెల అమ్మకాల్లో అత్యధికంగా నాట్కో ఫార్మా 31.2 శాతం వృద్ధి సాధించింది. బయోకాన్ 28.2, గ్లెన్‌మార్క్ 23.2, ఈరిస్ లైఫ్‌సైన్సెస్ 21.2 శాతం దూసుకెళ్లాయి. టోరెంట్, ఆస్ట్రాజెనికా, అజంతా, జైడస్, సన్ ఫార్మా, అబాట్, వొకార్డ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబ్స్ మార్కెట్ కంటే అధికంగా 16 నుంచి 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్డీసీ, ఆల్కెమ్, సిప్లా, గ్లాక్సోస్మిత్‌క్లైన్ 10–12 శాతం, లుపిన్, రెడ్డీస్, అలెంబిక్ 8–9 శాతం అధికంగా విక్రయాలు సాగించాయి. నొవార్టిస్, ఇండాకో రెమెడీస్, ఫైజర్, సనోఫి 3 శాతం లోపు వృద్ధికి పరిమితం అయ్యాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికానికి పరిశ్రమ 13 శాతం వృద్ధి సాధించింది. -
ఈ-ఫార్మసీలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు: ఏఐఓసీడీ
ముంబై : ఈ-ఫార్మసీల (ఆన్లైన్ ద్వారా ఔషధాల విక్రయం) వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) హెచ్చరించింది. ఔషధాలను (మెడిసిన్స్) సాధారణ వస్తువులతో పోల్చలేమని తెలిపింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ-ఫార్మసీల రూపంలో ఈ-కామర్స్ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించిందని వివరించింది. ఈ-ఫార్మసీలు ఎలాంటి రూపంలో ఉన్నప్పటికీ వాటి కార్యకలాపాలను ప్రస్తుత నిబంధనలు అనుమతించవని పేర్కొంది. ఆన్లైన్ ఔషధాల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-ఫార్మసీ బిజినెస్‌ను అనుమతించడం సరైందికాదని ఏఐఓసీడీ ప్రెసిడెంట్ జే ఎస్ షిండే తెలిపారు. కొన్ని సంస్థలు స్వలాభం కోసం ప్రజల జీవితాలతో ఆట్లాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఔషధాలను వైద్యులు, ఫార్మసిస్ట్స్ సలహాల మేరకే వినియోగించాలని సూచించారు. ఎవరి సూచనలు, సలహాలు లేకుండా ఆన్లైన్ ద్వారా ఔషధాలను తెప్పించుకొని ఉపయోగించడం సురక్షితం కాదని వివరించారు. ఆన్లైన్ ఔషధాల వినియోగానికి ప్రభు త్వం ప్రత్యేకమైన నిబంధనలను రూపొందిం చాలని కోరారు. ఆన్లైన్ ఫార్మసీల వల్ల చిన్న ఫార్మసీలు, వాటిపై ఆధారపడిన కుటుంబాలు, ఉద్యోగులకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.