Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt current scam with Axis Energy Venture India Private Limited1
‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌'

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినం­దిం­చాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్‌ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్‌ అవర్స్‌లో డిమాండ్‌ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్‌ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్‌లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవన–సౌర హైబ్రీడ్‌) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ పాతికేళ్ల పాటు యూనిట్‌ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్‌’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్‌లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్‌ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్‌లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్‌ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్‌ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్‌ జగన్‌ పెంచారు. విద్యుత్‌ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్‌ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్‌ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్‌ చట్టం 2003 సెక్షన్‌ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్‌ 108 ప్రకారం.. యాక్సిస్‌ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్‌ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్‌ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్‌ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్‌ విద్యుత్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్‌ డెవలపర్‌ నుంచి యూనిట్‌ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా?

Trump slaps 100% tariff on foreign films2
దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

Differences across the lifespan between females and males: GBD Study3
అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!

పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్‌ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్‌ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్‌లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్‌తో 25 దేశాల్లో, డయాబెటిస్‌తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్‌కు చెందిన గ్లోబల్‌ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్‌ బస్‌ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!)

IPL 2025, PBKS VS LSG: For The First Time Since 2014, Punjab Kings Have Reached 15 Points In IPL4
2014 సీజన్‌లో కూడా ఇలాగే.. పంజాబ్‌ టైటిల్‌ గెలుస్తుందా..?

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు (15 పాయింట్లు) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఉన్నా ఇప్పటివరకు టైటిల్‌ సాధించని జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ కూడా ఒకటి. ఈ జట్టు 2014 సీజన్‌లో అత్యుత్తమంగా ఫైనల్‌కు చేరింది. 17 ఏళ్ల ప్రస్తానంలో పంజాబ్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఏకైక సారి.కాగా, 2014 సీజన్‌ తరహాలోనే పంజాబ్‌ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ సీజన్‌ తర్వాత తొలిసారి ఈ సీజన్‌లోనే 15 పాయింట్లు సాధించింది. నాడు (2014) టేబుల్‌ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన పంజాబ్‌.. ఫైనల్లో కేకేఆర్‌ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ సీజన్‌లోలాగే పంజాబ్‌ ఈ సీజన్‌లోనూ పటిష్టంగా కనిపిస్తూ సామర్థ్యం మేరకు రాణిస్తుంది. ఇదే ఊపును మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే పంజాబ్‌ తమ తొలి టైటిల్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో ఈ సీజన్‌లో పంజాబ్‌ ఫేట్‌ మారినట్లు స్పష్టమవుతుంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఆ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పంజాబ్‌ ఈ సీజన్‌లో సక్సెస్‌ సాధించడంలో ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాంటింగ్‌ ఆథ్వర్యంలో ప్రతి పంజాబ్‌ ఆటగాళ్లు ఉరకలేస్తున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగం అన్ని జట్ల కంటే పటిష్టంగా ఉంది. మెగా వేలంలో పాంటింగ్‌ కీలకంగా వ్యవహరించి ప్రియాంశ్‌ ఆర్య లాంటి యువ టాలెంట్‌ను అక్కున చేర్చుకున్నాడు. ఈ సీజన్‌లో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ విశేషంగా రాణిస్తున్నాడు. మెగా వేలానికి ముందు పంజాబ్‌ సిమ్రన్‌ను అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి సిమ్రన్‌ న్యాయం చేస్తున్నాడు. మెగా వేలంలో రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా కెప్టెన్‌గా కూడా విజయవంతమవుతున్నాడు. పంజాబ్‌ యాజమాన్యం ఎంతో నమ్మకంతో అట్టిపెట్టుకున్న శశాంక్‌ సింగ్‌, నేహల్‌ వధేరా ఓ మోస్తరు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నారు.ఈ సీజన్‌లో పంజాబ్‌ విజయాల్లో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. అర్షదీప్‌ పైసా వసూల్‌ ప్రదర్శనలు చేస్తుండగా.. చహల్‌, జన్సెన్‌ సామర్థ్యం మేరకు రాణిస్తున్నారు.మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఛాంపియన్‌ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఫామ్‌ లేమితో బాధపడుతున్న మ్యాక్స్‌వెల్‌ గాయం కారణంగా వైదొలగడం కూడా పంజాబ్‌కు కలిసొచ్చే అంశమే. అతడి స్థానంలో మరో విధ్వంసకర బ్యాటర్‌ మిచెల్‌ ఓవెన్‌ను అక్కున చేర్చుకుంది పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌. ఆసీస్‌ ఆటగాళ్లు స్టోయినిస్‌, ఇంగ్లిస్‌ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్‌లో పంజాబ్‌ టైటిల్‌ గెలవడాన్ని ఎవరూ ఆపలేరు.

UN Security Council Discuss India Pak Tensions After Pahalgam5
ఐరాసలో నేడు పాక్‌-భారత్‌ పంచాయితీ

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్‌ 22న జమ్ము కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్‌.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్‌ కూడా కౌంటర్‌ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్‌ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్‌ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్‌ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్‌)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్‌ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

Big mystery over gold, Where does it came from?6
అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?

బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్‌ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్‌ జర్నల్‌ లెటర్స్‌’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్‌ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్‌’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్‌నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్‌ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్‌ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్‌–ప్రాసెస్‌ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్‌ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్‌ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్‌ (న్యూట్రాన్‌ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్‌ డాక్టోరల్‌ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్‌ పటేల్‌ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్‌ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎరిక్‌ బర్న్స్‌ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్‌ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్‌ సైజులో ఉండే మ్యాగ్నెటార్‌ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్‌ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్‌ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్‌ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్‌క్వేక్‌’లు వస్తాయట.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Pakistani journalists clash at London cafe viral clip7
ప్రెస్‌మీట్‌లో పాక్‌ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్‌

లండన్‌: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దారుణంగా ప్రవర్తించారు. విదేశాల్లో మీడియా సమావేశానికి హాజరైన ఇద్దరు పాక్‌ జర్నలిస్టులు మాత్రం.. పరస్పరం తిట్టుకుంటూ ఏకంగా బూతుపురాణం అందుకున్నారు. పాక్‌ నేత ప్రెస్‌మీట్‌ సందర్భంగా జరిగిన గొడవ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ సెక్రెటరీ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సల్మాన్‌ అక్రమ్‌ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సఫీనా ఖాన్‌, అసద్‌ మాలిక్‌తోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సఫీనా ఖాన్‌ పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తుండగా.. అసద్‌ మాలిక్‌, కొందరు ఇతర జర్నలిస్టులు వేర్వేరు చానళ్లలో పని చేస్తున్నారు. వీరంతా ఒక చోట చేరిన సమయంలో సఫీనా, అసద్‌ మాలిక్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇద్దరు గొడవకు దిగారు. బూతులు తిట్టుకున్నారు. కుటుంబాలను సైతం దూషించుకున్నారు. అక్కడున్న మిగతా జర్నలిస్టులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం మాలిక్, ఇతర పాక్‌ జర్నలిస్టులు తనను చంపేస్తామని బెదిరించారని సఫీనా ఖాన్‌ ట్వీట్‌ చేశారు. తనకు ఏదైనా జరిగితే ఈ ముగ్గురు రిపోర్టర్లే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆరోపణలను అసద్‌ఖాన్‌ తోసిపుచ్చారు. ఇద్దరు జర్నలిస్టుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Pakistani Journalism at its peak with journalists Safina Khan and Asad Malik fight it out at a London eatery. (Warning: Very Abusive Content)Delhi boys, take a bow, this language exceeds everything. pic.twitter.com/ZSdMOIpNyj— Ꮙarun (@Ambarseriya) May 4, 2025

Samantha Feels Happy At Her Movie Shubham Pre Release Event8
'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!

సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు... నిర్మాత కూడా. తాను స్వయంగా నిర్మించిన తాజా చిత్రం శుభం. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హర్షిత్‌ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సినిమా బండి మూవీ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిర్మాతగా సమంత కూడా హాజరయ్యారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో సామ్ సందడి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ వస్తే ఏ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాల్సిందేనని సామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల్లాగే నాకు మళ్లీ బ్లాక్‌ బస్టర్ ఇస్తారని అనుకుంటున్నా అని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనేదే నా లక్ష్యమని సమంత తెలిపారు. భవిష్యత్తులో అందరినీ ఆకట్టుకునే కథలను మీ ముందుకు తీసుకు రావాలని ఆశిస్తున్నానని సామ్ వెల్లడించారు. మీ ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. మీరు లేకపోతే నేను నథింగ్ అంటోంది టాలీవుడ్ బ్యూటీ.అయితే ఈ ఈవెంట్‌లో సమంత ఫుల్ ఎమోషనల్ అయింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈవెంట్‌లో జరుగుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్‌ను తలచుకుని సామ్ ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్‌ సైతం భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. நான் உன் அழகினிலே தெய்வம் உணருகிறேன்🎶Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#Subham #SubhamPreReleaseEvent #SubhamOnMay9 pic.twitter.com/QKUPjzwRy4— Samcults (@Samcults) May 5, 2025

Bengal Man Bites Off And Swallows Wife Nose9
ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..

ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్‌ షేక్‌ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్‌ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

know about latest New Fund Offers for investment10
న్యూ ఫండ్‌ ఆఫర్లపై ఓ లుక్కేయండి!

యూటీఐ మల్టీ క్యాప్‌ ఫండ్‌వివిధ మార్కెట్‌ క్యాప్స్‌వ్యాప్తంగా ఇన్వెస్ట్‌ చేసే మల్టీ క్యాప్‌ ఫండ్‌ను ప్రకటించింది యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మే 13 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్‌ స్టాక్స్‌లో 3ఎస్‌ విధానంతో (సైజు, సెక్టార్, స్టయిల్‌) ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సెగ్మెంట్‌కి కనీసం 25 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. పటిష్టమైన ఫండమెంటల్స్‌తో టర్న్‌రౌండ్‌ అవకాశాలు ఉండి ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభించే స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుందని యూటీఐ ఏఎంసీ సీఐవో వెట్రి సుబ్రమణియమ్‌ తెలిపారు. దీనికి కార్తీక్‌రాజ్‌ లక్ష్మణన్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ క్వాలిటీ ఫండ్‌ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ క్వాలిటీ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 6న మొదలు కానుంది. 20వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్లకు అనుమతి ఉంటుంది. ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ‘నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్‌ఐ’ కొనసాగుతుంది. ఇహబ్‌ దల్వాయ్, మసూమి జుర్మర్‌వాలా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన నగదు ప్రవాహాలు, రుణ భారం తక్కువగా ఉండి, నిధుల వ్యయాల సామర్థ్యాలు గొప్పగా ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేస్తుంది. అందుకే పథకానికి క్వాలిటీ అని పేరు పెట్టారు. సుమారు 625 కంపెనీలను జల్లెడ పట్టి అందులో మెరుగైన 40–60 కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్‌ చేస్తుంది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను నాణ్యమైన కంపెనీలు ఎదుర్కొని బలంగా నిలబడగలవని భావిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ పథకాన్ని తీసుకొచి్చంది. పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయిస్తే విలువపై ఒక శాతం ఎగ్జిట్‌ లోడ్‌ అమలవుతుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే ఎగ్జిట్‌ చార్జీలు ఉండవు. ఇదీ చదవండి: త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థగ్రో సిల్వర్‌ ఈటీఎఫ్‌వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం గ్రో మ్యూచువల్‌ ఫండ్‌ ‘గ్రో సిల్వర్‌ ఈటీఎఫ్‌’ ఎన్‌ఎఫ్‌వోను ప్రారంభించింది. ఈ నెల 16 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మే 30 నాటికి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ పెట్టుబడులు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దేశీ వెండి ధరలకు అనుగుణంగా గ్రో సిల్వర్‌ ఈటీఎఫ్‌ ట్రేడవుతుంటుంది. వెండి ధరల గమనానికి అనుగుణంగానే ఇందులో లాభ, నష్టాలు ఆధారపడి ఉంటాయి. భౌతిక వెండి కొనుగోలు, నిల్వ, విక్రయం వంటి సమస్యలను సిల్వర్‌ ఈటీఎఫ్‌ తప్పిస్తుంది. ఇందులో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాబడులు కోరుకునే వారికి ఇది అనుకూలమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగారం–వెండి నిష్పత్తి 91.64 వద్ద ఉందని.. ఈ ప్రకారం చూస్తే బంగారం కంటే వెండి ధరలే అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement