ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియా డాన్‌గా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర (148వ రోజు) ఆదివారం కృష్ణా జిల్లా పామర్రు చేరుకుంది. చంద్రబాబు పాలనలో రైతులు ఇసుకాసురులు, మట్టికాసురులను చూస్తున్నారంటూ విమర్శించారు. బాబు పాలనలో అంతా అవినీతిమయమే అని ద్వజమెత్తారు.