సాధారణంగా పులితో సరదా అంటే రిస్కే. అయితే ఎప్పుడూ రేసుల్లో దూసుకుపోయే మెర్సిడెస్ జట్టు డ్రైవర్, విశ్వ విజేత లూయిస్ హామిల్టన్కు ఎందుకో పులితో ఆడుకోవాలని సరదా పుట్టింది. ఇటీవల మెక్సికో ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన తరువాత హామిల్టన్ ఆ ముచ్చట తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా స్థానికంగా పులి ఎన్ క్లోజర్లోకి వెళ్లిన హామిల్టన్ ఆ ముచ్చటను తీర్చుకున్నాడు.