ఇకపై ఆర్టీసీ ప్రయాణం మరింత సులభతరమైంది. జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు అవసరం లేదు. 30 రోజు ల అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలుకొని, అప్పటికప్పుడు బయలుదేరే బస్సులకూ రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్‌లోకి తెచ్చే పథకాన్ని ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు సోమవారం బస్‌భవన్‌లో ప్రారంభించారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులందరికీ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ టీఎస్‌ఆర్‌టీసీ బస్ డాట్ ఇన్’’ ద్వారా, ఏపీ ప్రయాణికులు ‘‘డ బ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్ డాట్ ఇన్’’ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం తో రిజర్వేషన్, ఏటీబీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశముంటుందని అంచనా. ప్రయా ణానికి గంట ముందు కూడా బుక్ చేసుకోవచ్చు.
Nov 18 2014 4:14 PM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
Advertisement
