కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భూమా నాగిరెడ్డి వారసున్ని ప్రకటించవద్దని మంత్రి అఖిలప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. అఖిలప్రియ తల్లి దివంగత శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భూమా వారసున్ని ప్రకటించాలని మంత్రి అఖిలప్రియ నిర్ణయించారు. ఈమేరకు ఆమె ప్రకటన కూడా చేశారు.