అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రవిభజన అంశంపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ముందుగా కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందన్నారు. రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ నిర్ణయం ఏంటో ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించిందన్నారు. ఓట్లు.. సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ ఆలోచన చేస్తుందని విమర్శించారు. స్వార్థంతోనే తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు. అందరికికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు.