శ్రీశైలం డ్యాం వద్ద చిరుత సంచారం | leopard at srisailam dam | Sakshi
Sakshi News home page

Sep 11 2016 9:34 AM | Updated on Mar 20 2024 3:39 PM

శ్రీశైలం డ్యాం వద్ద శనివారం రాత్రి 8గంటల సమయంలో చిరుత సంచరించడంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డ్యాం ప్రధాన ద్వారాలలోని రెండో గేటు రోడ్డుపై చిరుత సంచరిస్తూ నిద్రకు ఉపక్రమించింది. తెలంగాణా సరిహద్దుకు ఆనుకుని ఉన్న రెండో గేటు వద్ద చిరుత సంచరించడంతో ఎస్పీఎఫ్‌ పోలీసులు, డ్యాం సిబ్బంది గేటును మూసివేశారు. అక్కడే కొద్దిసేపు సంచరించిన చిరుత గోడపై పడుకుని విశ్రాంతి తీసుకుంది. గతంలో శ్రీశైలం డ్యాంపైన వాహనాల రాకపోకలు జరిగేవి.

Advertisement
 
Advertisement
Advertisement