బెంగళూరులోని ఓ ఏటీఎంలో బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగుడు ఈ దాడికి ముందుగానే వ్యూహరచన చేసినట్లు తేలింది. బాధితురాలు ఏటీఎంలోకి వెళ్లే 15 నిమిషాలు ముందే నిందితుడు అందులోకి వెళ్లి దాడికి అనువైన పరిస్థితి ఉందో లేదో చూసుకున్నట్లు ఏటీఎం సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది.