ఇంటర్నెట దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త పేరుగా అల్టాబా ఇంక్గా నామకరణం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. యాహూ తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్లు డిజిటల్ అడ్వర్టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్కు విక్రయించిన సంగతి తెలిసిందే. 4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది.