
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు.