
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం.నాగరాజ్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఈర్లదిన్నె, నాగల్‌కడ్మూర్, పాంరెడ్డిపల్లె, మస్తీపురం గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమని, అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, నాయకులు చుక్క ఆశిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.