
మహనీయుడు వాల్మీకి మహర్షి
వనపర్తి: దేశానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించగా.. ఆయన హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన రామాయణాన్ని రచించారని, ఈ గ్రంథం ద్వారా సమాజానికి అనేక విలువలు అందించారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని, ఇతిహాసాల్లో మొదటిది రామాయణమన్నారు. నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, వాల్మీకి సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్