
కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
ఖిల్లాఘనపురం: కార్మికుల బకాయి వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల వినతిపత్రాన్ని వైద్యులు డా. మాధవి, డా. పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జీఓ నంబర్ 60ని తుంగలో తొక్కి కార్మికులకు ఇస్తున్న అరకొర వేతనం రూ.11,250 నుంచి కోత విధిస్తూ రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల పొట్టకొడుతున్న వెంకటయ్య సెక్యూరిటీ సర్వీస్ ఏజన్సీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికులు భీమన్న, నాగయ్య, మునీందర్, వెంకటేష్, సాయికృష్ణ, నజ్మా, ప్రియాంక, పద్మ పాల్గొన్నారు.