
పోలింగ్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
అమరచింత: ఎన్నికల నిర్వహణలో అతిముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ రోజు అప్రమత్తంగా ఉంటూ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాలని పీఓ, ఏపీఓలకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్‌రావు సూచించారు. ఎన్నికల నిర్వహణపై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన వారిని నిషితంగా పరిశీలించి, వారి వయస్సుపై అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు తెలియ పర్చాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల వ్యవహారంలో సానుకూలంగా ఉండి వారు ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యే ్డక అధికారి అప్జలుద్దీన్, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ భాస్కర్ సింగ్, ఎంపీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్‌రావు