
పీఓల పాత్ర కీలకం
ఖిల్లాఘనపురం/గోపాల్‌పేట: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పీఓల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీ) యాదయ్య అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, గోపాల్ పేట మండల కేంద్రాల్లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఓటీలతో మాట్లాడారు. శిక్షణకు వచ్చిన పీఓ, ఏపీఓలకు ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫారం, బ్యాలెట్ బాక్సు నిర్వహణ తదితర అన్ని విషయాల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ సునీత, ఎంఈఓ జయశంకర్ మాట్లాడుతూ సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీఓ, ఏపీఓలకు మాత్రమే శిక్షణ ఇచ్చామని, మంగళవారం సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజు, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు.