
అనధికార బాణసంచా దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఎంవీపీకాలనీ: దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో, శివారు ప్రాంతాల్లో అనధికార బాణసంచా దుకాణాలపై సిటీ టాస్క్‌ఫోర్స్ కొరడా ఝులిపిస్తోంది. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంవీపీ కాలనీలోని టాస్క్‌ఫోర్స్ టీమ్ రెండు రోజులుగా నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న దుకాణాలపై దాడులు చేసి, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా సామగ్రిని విక్రయిస్తున్న ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన లక్ష్మి, నెల్తేరుకు చెందిన దాసరి దేముడు, భీమిలి మండలం ఎగువపేటకు చెందిన బడిదబోయిన గంగాధర్, పద్మనాభం మండలం అచ్చుకున్నపాలెంకు చెందిన గేదెల రమణపై కేసులు నమోదు చేసి..ఆయా పోలీస్‌స్టేషన్లకు వీరిని అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం వెల్లడించారు. అనధికారిక బాణసంచా దుకాణాలపై 112కు గాని, 79950 95799 నంబర్‌కు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.