
దేశంలో రక్త అవసరాన్ని తీర్చడం అంత సులభం కాదు
మంత్రి సత్యకుమార్
కొమ్మాది: సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రక్త అవసరాలు తీర్చడం అంత సులభం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో హేతుబద్ధ వినియోగం జీవన విధానం మారాలని, తద్వారా రక్త సరఫరా కొరతను అధిగమించవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ఏటా అవసరమైన రక్తం సుమారు 1.5 కోట్ల యూనిట్లు అంచనా కాగా, 10–40 లక్షల యూనిట్ల కొరత ఉందని నివేదికలు చెబుతున్నాయన్నారు. రక్తం, దాని ఉత్పత్తులను హేతుబద్ధంగా వినియోగించడం అంటే సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన రక్తన్ని అందించడమేనన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా రక్త వినియోగంలో శాసీ్త్రయ, మానవతా దృక్పథం రెండింటినీ సమన్వయం చేయాలని కోరారు.