
దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐసీసీ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ కీలక ఘట్టానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఐదు వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 9న జరిగే మొదటి మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మంగళవారం నగరానికి చేరుకుంది. విశాఖ వేదికగా తొలి మ్యాచ్ ఆడబోతున్న భారత్ మహిళల జట్టు ఇప్పటికే ఇక్కడికి చేరుకుని మంగళవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. కాగా.. టీమిండియా ఈ టోర్నమెంట్‌లో హాట్రిక్ విజయంపై కన్నేసింది. గత ప్రపంచ కప్‌లో ఐదో స్థానంతో సంతృప్తి పడిన భారత్.. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకను 59 పరుగుల తేడాతో, పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించి మంచి ఊపు మీదుంది. విశాఖ వేదికగా ఆ ఊపును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరినా (2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో) టైటిల్ సాధించలేకపోయిన భారత జట్టు.. ఈసారి కప్ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినా పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నాయి.
విజయమే లక్ష్యంగా టీమిండియా ప్రాక్టీస్

దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది

దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది

దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది

దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది

దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది