
ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకేనా..?
రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగులకు లేని నిబంధనలు ఒక్క ఉపాధ్యాయులకే ఎందుకు పెడుతున్నారో అర్థంకావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు అవసరాలు పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా వదిలేశాయి. ఇలాంటి నిబంధనలు మాత్రం మాపై రుద్దడం మంచిదికాదు. మరో వారంలో టెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దవాబ్దాలుగా ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం ఇంతవరకు ప్రకటించకపోవడం బాధాకరం.
– టి.ఆర్ అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్