
డీజే సౌండ్‌కు వ్యక్తి మృతి
పెందుర్తి: మండలంలో పెదగాడి గ్రామంలో ఆదివారం రాత్రి కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌కు గ్రామానికి చెందిన అప్పికొండ (56) మృతి చెందాడు. దుర్గాదేవి ఊరేగింపులో శ్రుతిమించిన సౌండ్ పెట్టడంతో త్రినాథ్ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటి వరకు త్రినాథ్ డీజే సౌండ్‌కు డ్యాన్సు చేశాడు. ఉన్నట్టు ఈ పరిణామం చేసుకోవడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాస్తవానికి ఊరేగింపుల్లో డీజే సౌండ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెపుతున్నా కూటమి నాయకులు ఆ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. నియోజకవర్గంలో కూటమి ముఖ్యనాయకులతో పాటు చోటా మోటా నాయకులు సైతం పోలీసుల తీవ్ర వత్తిడి తెచ్చి డీజే సిస్టమ్స్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో డీజే శబ్దాలకు ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీజే సౌండ్‌కు వ్యక్తి మృతి