
29 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
మహారాణిపేట: వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసేందుకు, కారుణ్య నియామకాల కింద ఎంపికై న 29 మందికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోమవారం నియామక పత్రాలను అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ పాల్గొన్నారు. నియామక పత్రాలు పొందినవారిలో 16 మంది జూనియర్ అసిస్టెంట్లు, 8 మంది టైపిస్ట్‌లు, ఐదుగురు ఆఫీసు సబ్–ఆర్డినేట్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియమితులైనవారు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

29 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత