
కుక్కల పట్టివేత... డెబ్రిస్ తరలింపు
కొమ్మాది: రాష్ట్రంలో ఏకై క అంతర్జాతీయ గుర్తింపు పొందిన (బ్లూ ఫ్లాగ్) రుషికొండ బీచ్ నిర్వహన అధికారులు గాలికి వదిలేశారు. దీనిపై ఈ నెల 4వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అపహాస్యం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీచ్ వద్ద పెద్ద ఎత్తున డెబ్రిస్ డంప్ చేయడం, చిల్డ్రన్స్ పార్కు నీట మునగడం, కుక్కలు, పశువులు బీచ్‌లో సంచరించడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురించిన కథనానికి సోమవారం అధికారులు చర్యలు చేపట్టారు. బీచ్ వద్ద డంప్ చేసిన డెబ్రిస్‌ను తొలగించారు. చిల్డ్రన్స్ పార్కును మట్టితో చదును చేశారు. అదే విధంగా జీవీఎంసీ సిబ్బందితో కుక్కలను పట్టుకుని వేరొక చోటుకు తరలించారు. దీనిపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.

కుక్కల పట్టివేత... డెబ్రిస్ తరలింపు