
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహనకు షాపింగ్ ఫెస్టివల్
మహారాణిపేట : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కలగజేయడంతోపాటు లబ్ధిని నేరుగా ప్రజలకు అందించేందుకు షాపింగ్ ఫెస్టివల్‌ను ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’పై కలెక్టరేట్‌లో 2–వీలర్, 4–వీలర్, ఎలక్ట్రానిక్ గృహపకరణాలు, మొబైల్స్, ఫర్నిచర్ తదితర వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పాల్గొనే వారి సంఖ్యను బట్టి స్థలం నిర్ణయించడం జరుగుతుందన్నారు. జీఎస్టీ 2.0 వల్ల చేకూరే లబ్ధిని వివరిస్తూ స్టాల్స్ ముందు బోర్‌ుడ్స ఏర్పాటు చేయాలని, ఫెస్టివల్‌కి వచ్చే కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. జాయింట్ కలెక్టర్, జీఎస్టీ నోడల్ అధికారి మయూర్ అశోక్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్.శేఖర్, జిల్లా టూరిజం అధికారి మాధవి, రవాణా శాఖ అధికారులు, హోటల్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు