
జీవీఎంసీకి 112 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 112 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 59 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 6, రెవెన్యూ విభాగానికి 8, ప్రజారోగ్య విభాగానికి 5, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 18, మొక్కల విభాగానికి 7, యూసీడీ విభాగానికి 9 ఫిర్యాదులు వచ్చినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ తెలిపారు. ఫిర్యాదులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.