
నవంబర్ 7న ‘ఫ్యాప్టో’ మహాధర్నా
తగరపువలస: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7న విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ బమ్మిడి కేశవరావు కోరారు. ఆదివారం ఆనందపురంలో మహాధర్నా పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేసి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బకాయి ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మిత్ర సంఘాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.