
జూలో ఉత్సాహంగా బర్డ్స్ వాచ్
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో జరుగుతున్న వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బర్డ్స్ వాచ్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని, జూలోని చెట్లపై తిరుగుతున్న వివిధ పక్షి జాతులను గుర్తించి, పరిశీలించారు. అలాగే దూరంగా ఎగురుతున్న సీతాకోక చిలుకలను బైనాక్యులర్ల ద్వారా వీక్షించారు. జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ పిల్లలకు వన్యప్రాణులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఎలక్యూషన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనదలచినవారు 9491569344ను సంప్రదించాలని కోరారు.

జూలో ఉత్సాహంగా బర్డ్స్ వాచ్