
యువకులను రక్షించిన లైఫ్‌గార్డ్స్
ఏయూక్యాంపస్: ఆర్కే బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను పోలీసులు, లైఫ్‌గార్డులు రక్షించారు. మింది ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు బీచ్‌కు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా.. వారిలో కిలారి సిద్ధు, అకిరి చరణ్ తేజ అలల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన మైరెన్ పోలీసుల సమాచారంతో జీవీఎంసీ లైఫ్‌గార్డులు పోలిరాజు, అచ్చన్న రంగంలోకి దిగారు. యువకులిద్దరినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధు ఆరోగ్యం నిలకడగా ఉండగా.. చరణ్ తేజకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.