
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
సీతంపేట: యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం మైసూర్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి 12 వరకు జరగనున్న 50వ జాతీయ యోగా పోటీలకు అక్కయ్యపాలేనికి చెందిన చెల్లుబోయిన నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. నాగేశ్వరరావు జిల్లా మలేరియా కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన విద్యార్థులకు ట్రయథ్లాన్‌లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నాగేశ్వరరావును జిల్లా మలేరియా అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు.