
ఓపెన్ చెస్ టోర్నీ సద్వినియోగం చేసుకోండి
ధర్మవరం అర్బన్: తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హైబ్రో చెస్ అకాడమీ ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీవీ సుబ్బారావు, అధ్యక్షుడు చాంద్‌బాషా, కార్యదర్శి జాకీర్ హుసేన్ కోరారు. పట్టణంలోని కొత్తపేట ఉషోదయ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 8, 9 తేదీల్లో తెలుగు రాష్ట్రాల స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ రుసుం రూ.600 ఉంటుందన్నారు. నవంబర్ 8వతేదీ ఉదయం 8గంటల్లోపు ఎంట్రీఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 99126 47370, 08559–221813 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి మోహన్, వైకే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.