
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం
పుట్టపర్తి టౌన్: రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఫంక్షన్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు హాజరై వాల్మీకిమహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీతారాముల సద్గుణాలు, గొప్పతనం, కుటుంబ విలువల నుంచి పాలన సూత్రాల వరకు సమాజ శ్రేయస్సుకు అవరమైన ఎన్నో విషయాలను రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేశారన్నారు. మహనీయుల అడుగు జాడల్లో నడిచి తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్పిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు గంగన్న, సాధికారత సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పంచాయతీ
కార్యదర్శులకు శిక్షణ
అనంతపురం సిటీ: స్థానిక ఆర్డీటీ స్టేడియం సమీపంలో ఉన్న ఎకాలజీ సెంటర్‌లో పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య మంగళవారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి ఒక్కో కార్యదర్శి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు (మూడు రోజుల పాటు) శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. శిక్షణ తరగతులను జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ప్రారంభిస్తారని వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం