
వైభవంగా చింతల రాయుడి కల్యాణం
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం తరఫున మంగళ వాయిద్యాలతో పట్టు వస్త్రాలను ఆలయానికి చేర్చారు. చింతల వేంకటరమణస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చి ప్రధాన అర్చకుడు మురళీస్వామి ఆధ్వర్యంలో ఆశ్వయుజ పౌర్ణమి ఘడియల్లో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. అనంతరం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీకట్ట నుంచి రథోత్సవం ప్రారంభమైన కొద్దిసేపటికే అకాశం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి. జల్లుల నడుమ గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగుతూ పరవశించిపోయారు. రథం ముందు భాగంలో వందన డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. వివిధ వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు.
చిరుజల్లుల నడుమ రథోత్సవం

వైభవంగా చింతల రాయుడి కల్యాణం

వైభవంగా చింతల రాయుడి కల్యాణం

వైభవంగా చింతల రాయుడి కల్యాణం