శింగరకొండపై హైకోర్టు జడ్జి పూజలు | - | Sakshi
Sakshi News home page

శింగరకొండపై హైకోర్టు జడ్జి పూజలు

Oct 6 2025 2:42 AM | Updated on Oct 6 2025 9:23 AM

శింగరకొండపై హైకోర్టు జడ్జి పూజలు శివాజీ పల్లకి సేవకు స్వాగతం ఆలయ నిర్మాణానికి విరాళం ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ హోరాహోరీగా ఎడ్ల పోటీలు

అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండపైనున్న లక్ష్మి నరసింహ స్వామిని హైకోర్టు జడ్జి డాక్టర్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట అద్దంకి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగలక్ష్మి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బత్తుల అఖిల ప్రియ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సీత ఉన్నారు.

మాదల(ముప్పాళ్ళ): ఆంధ్రప్రదేశ్‌ మరాఠా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పల్లకి సేవ వాహన యాత్రకు మండలంలోని మాదల గ్రామం వద్ద సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. మరాఠా సంఘం అధ్యక్షులు వెంకట సోమౌజీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయం నుంచి శ్రీశైలం శ్రీమల్లికార్జునస్వామి ఆలయం వరకు సాగనుంది. యాత్ర వాహనాలకు మాదల వద్ద సంఘ సభ్యులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముప్పాళ్ళ మీదుగా నరసరావుపేటకు యాత్ర వెళ్లింది. సంఘ సభ్యులు పులహరి పిరోజీ తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయ స్వామి సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి రాతి ఆలయ నిర్మాణానికి ఆదివారం పలువురు దాతలు విరాళాలను కమిటీ సభ్యులకు అందించారు. పట్టణానికి చెందిన మెడికల్‌ వ్యాపారి అర్వపల్లి రామకోటి సుబ్బారావు, నాగేశ్వరి దంపతులు ముఖమండపం 12వ రాతి స్తంభం నిర్మాణానికి రూ.3,01,116 అందించారు. అలాగే వర్రా సావిత్రమ్మ రూ.51,116, అర్వపల్లి సాంబశివరావు, వెంకట విజయలక్ష్మి దంపతులు రూ.25,116 ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పులుపుల రాము, వనమా సాంబశివరావు, కోవూరు శివశ్రీనుబాబు, వనమా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పరీక్ష కేంద్రంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం పరిశీలించారు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలకలూరు రోడ్డులోగల విజ్ఞాన్‌ నిరులా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పరీక్షలను జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌), నోడల్‌ అధికారి రమణమూర్తితో కలిసి ఎస్పీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సౌత్‌ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ వాసు పాల్గొన్నారు.

బయ్యవరం(క్రోసూరు): మండల పరిధిలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆరు పళ్ల విభాగంలో విజేతలుగా ఎనిమిది జతలు నిలిచాయి. ఆదివారం నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు గెలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టపక్కల గ్రామాల రైతులు ఎడ్ల పోటీలు తిలకించేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement