నకిలీపై మహిళలు ఉద్యమించాలి
పర్సనల్ శాఖగా పోలీసులు
● పచ్చ మీడియాతో కావాలనే
విష ప్రచారం చేశారు
● అలవికాని హామీలు ఇచ్చి మూడు
పార్టీలు అధికారంలోకి వచ్చాయి
● సంపద సృష్టి కేవలం కూటమి నేతలు,
కార్యకర్తలకే
● మనం అభివృద్ధి చేస్తే వారు
ప్రైవేటీకరణ చేస్తున్నారు
● రానున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
కార్యకర్తలే పాలిస్తారు
● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా విస్త్రృత
స్థాయి సమావేశంలో రీజనల్
కోఆర్డినేటర్ వై.వీ. సుబ్బారెడ్డి
● హాజరైన జిల్లా సమన్వయకర్తలు,
ముఖ్యనేతలు, కార్యకర్తలు
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: కూటమి నేతలు, పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారమే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమికి ప్రధాన కారణమని వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అయితే వాటిని మరుగునపెట్టి కావాలనే కూటమి నేతలు విషప్రచారం చేశారన్నారు. మరోవైపు మూడు పార్టీలు కలసి వచ్చి అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా మోసం చేస్తున్నారన్నాని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు తాను, తన పార్టీ వారికి మాత్రమే సంపద చేరుతోందన్నారు. మనం మెడికల్ కళాశాలలు, పోర్టులు, ఆసుపత్రులు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి దోచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని, ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు చేయించాలన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలను, రచ్చబండలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. రానున్న ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలే నడిపిస్తారన్నారు. కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కమిటీలు ఎంతో కీలకమని, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. నవంబర్ 20 నాటికి అన్ని కమిటీలు పూర్తి కావాలన్నారు. నకిలీ మద్యం, బెల్టుషాపులతో కూటమి నేతలు ప్రజల ప్రాణాలను తీస్తున్నారన్నారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, ఎస్‌ఇసీ మెంబర్లు ఈదా సాంబిరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్‌సీ సెల్ కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్‌కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సీనియర్ నాయకులు గజ్జెల నాగభూషణరెడ్డి, దేవేళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, యువత, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, అంగన్‌వాడీ విభాగ కన్వీనర్ హెల్డా ప్లోరెన్స్, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ అరాచకం, దౌర్జన్యాలకు నిరసనగా ప్రజలు బయటకు రావాలి. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి. రాష్ట్రానికి జగనే దిక్సూచీ అని, కూటమి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని, జగన్ వెంట ప్రతి ఒక్కరూ నడవాలి. జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కటాన్ని విమర్శించిన చంద్రబాబు మొన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయటంలో తాను కూడా బటన్ నొక్కాడు. అయితే వారిని మోసం చేశాడు. సుమారు 15 లక్షల మంది ఆటోవాలాలు, కాబ్, లారీ డ్రైవర్లు ఉంటే 18 నిబంధనలు పెట్టి 2.96లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
–పూనూరి గౌతమ్‌రెడ్డి,
పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు
పోలీసు శాఖను పర్సనల్ డిపార్టుమెంట్‌గా తయారుచేసి వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారు. జిల్లా మొత్తం కార్యకర్తలు ఉత్సాహంగా ఉండటంపై కూటమి నాయకులు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవటం గ్యారెంటీ అని, అప్పుడు వారికి జగన్ 2.0 పాలన చూపిస్తాం. పోలీసులను చూసి భయపడే స్టేజ్ దాటిపోయిందని, ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయి.
–డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త
దుష్ప్రచారంతోనే ఓటమి